వామ్మో... కార్తీ అన్ని గెట‌ప్పుల్లోనా?

Update: 2016-08-29 09:30 GMT
ఒక‌టి కాదు - రెండు కాదు.. ఏకంగా 47 గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట కార్తీ. వాటికోసం ఆయ‌న మామూలుగా క‌ష్ట‌ప‌డ‌టం లేదు. ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేస్తున్నాడ‌ట‌. కార్తీ  అన్ని గెట‌ప్పులు ఏ సినిమాకోసం వేస్తున్నాడో తెలుసా? క‌ష్మోరా కోసం. గోకుల్ అనే ద‌ర్శ‌కుడు తెరకెక్కిస్తున్న త‌మిళ చిత్రమే ఇది. తెలుగులోనూ  విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో కార్తీ మూడు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.  సైనికాధికారీ రాజ్ నాయక్ - నేటితరం యువకుడు - రహస్యాన్ని చేధించే గూఢ‌చారి... ఇలా మూడు  పాత్రలలో కనిపించనున్నాడు కార్తీ. ఒక  సినిమాలో రెండు మూడు గెట‌ప్‌ లంటేనే వామ్మో అంటారు.

అలాంటిది ఏకంగా 47 గెట‌ప్పులంటే ఇక ఆ వ్య‌వ‌హారం ఏ రేంజ్‌ లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. వీటికోసం  ఏకంగా ఏడు నెల‌ల‌పాటు శ్ర‌మించార‌ట. మ‌రి ఆ గెట‌ప్పుల‌న్నీ ఒక్క కార్తీనే వేశాడా లేక ఇత‌ర న‌టీన‌టులు కూడా వేశారా అన్న విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. బాహుబ‌లి టైపులో తెర‌కెక్కుతున్న ఓ హార‌ర్ చిత్ర‌మిది.  క‌థానాయిక‌లుగా నయ‌న‌తార‌ - శ్రీదివ్య న‌టిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News