త‌మ్ముడు ఫామ్ లోకి.. అన్న ఎప్పుడు?

Update: 2019-11-03 11:49 GMT
కార్తీ న‌టించిన ఖైదీ విజ‌య‌వంతంగా రెండో వారంలో ప్ర‌వేశించింది. తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ 7  రోజుల్లో రూ.4 కోట్ల షేర్ వసూలు చేసింది.  తెలుగేతర రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే..  తమిళనాడులో రూ.25 కోట్లు.. కర్ణాటకలో రూ.1.82 కోట్లు.. కేరళలో రూ.3.26 కోట్లు.. మిగ‌తా రాష్ట్రాల్లో రూ.1.16 కోట్లు వసూలయ్యాయి. వారం రోజుల్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.40 కోట్లు.. యూఎస్- కెనడా- ఇతర దేశాల్లో రూ.9.75 కోట్లు వసూలు చేసింది. దాంతో 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్.. 26 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ రూ.4.3 కోట్లు జరిగితే ఆ మొత్తాన్ని ఏడు రోజుల్లోనే సాధించింది. తమిళంలో రూ.24 కోట్ల బిజినెస్ జరిగితే.. 42 కోట్ల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంతో విడుదలైంది. ఇప్పటికే ఆ మొత్తానికి చేరువై డిస్టిబ్యూటర్లలో ఉత్సాహం నింపింద‌ని రిపోర్ట్ అందింది.

మొత్తానికి కార్తీ తెలుగులో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. కార్తీ దెబ్బ‌కు పోటీగా రిలీజైన‌ వేరే అనువాద చిత్రానికి లాస్ రావ‌డంపైనా చ‌ర్చ సాగింది. ఇక ఖైదీ చిత్రం తెలుగులో 4 కోట్ల షేర్ 10 కోట్ల గ్రాస్ తో ఖైదీ బ‌య్య‌ర్ల‌లో ఉత్సాహం నింపింది. ఆ క్ర‌మంలోనే ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. త‌మ్ముడు స‌రే.. మ‌రి అన్న సూర్య‌ మాటేమిటి?  అంటూ అప్పుడే డిస్క‌ష‌న్ వేడెక్కిస్తోంది.

సూర్య గ‌త కొంత‌కాలంగా స్ట్ర‌గుల్ లోనే ఉన్నాడు. గ‌జిని .. సింగం డేస్ కోసం అత‌డు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. స‌రైన కంబ్యాక్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. సూర్య నటించిన గ‌త చిత్రాలు ఎన్జీకే.. కాప్ప‌న్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది.  ఆ క్ర‌మంలోనే సూర్య కంబ్యాక్ ఎప్పుడు? అంటూ తెలుగు ఫ్యాన్స్ లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2020లో సూర్య రెండు భారీ చిత్రాలతో అభిమానుల ముందుకు రానున్నాడు. సూర‌రై పొట్రు .. సూర్య 39 ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి. సూర‌రై పొట్రు ఓ బ‌యోపిక్. ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతోంది. సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సూర్య 39 చిత్రానికి విశ్వాసం ఫేం (ద‌రువు) శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రెండిటిపైనే అభిమానుల హోప్.
Tags:    

Similar News