‘ఊపిరి’ అంతకుమించి అంటున్న కార్తి

Update: 2016-04-04 17:30 GMT
తన కెరీర్లో ఇప్పటిదాకా తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ సినిమాకే అత్యధిక ప్రశంసలు లభించాయని.. ఐతే ‘ఊపిరి’ సినిమా దాన్ని మించి ప్రశంసలు తెచ్చిపెట్టిందని అంటున్నాడు కార్తి. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి తాను రెండు భాషల్లోనూ సినీ ప్రముఖులు.. ప్రేక్షకుల ప్రశంసల్లో తడిసి ముద్దవుతున్నానని కార్తి చెప్పాడు.

‘‘నా తొలి సినిమా పరుత్తి వీరన్ నాకు మరిచిపోలేని జ్నాపకం. ఇప్పటికీ జనాలు ఆ సినిమా గురించి ప్రస్తావించి నన్ను పొగుడుతుంటారు. ఐతే ‘ఊపిరి’లో నా నటనకు అంతకుమించి ప్రశంసలు లభించాయి. ఇది నా కెరీర్లో మరో మైలురాయి. ఈ సినిమా నాపై వ్యక్తిగతంగానూ ఎంతో ప్రభావం చూపించింది. జీవితం విలువ ఏంటన్నది ఈ సినిమా చేశాకే నాకు అర్థమైంది. మనం డబ్బు వెంట పరుగులు తీస్తూ జీవితంలోని అందాల్ని కోల్పోతున్నాం. నా కూతురితో ఎక్కువ సమయం గడపలేకపోతూ నేను ఎంత ఆనందాన్ని కోల్పోతున్నానో ఈ సినిమా చేస్తున్నపుడు నాకర్థమైంది. ‘ఊపిరి’ సినిమా నన్ను చాలా మార్చింది’’ అని చెప్పాడు కార్తి.

ఊపిరి తెలుగు - తమిళ భాషల్లో తొలి వారంలోనే రూ.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ‘ఊపిరి’.. రెండో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఐతే ఈ శుక్రవారం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వచ్చాక తెలుగులో ‘ఊపిరి’ జోరుకు కళ్లెం పడే అవకాశాలున్నాయి. అయినప్పటికీ ఫుల్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ రూ.45 కోట్లకు చేరొచ్చని అంచనా.
Tags:    

Similar News