తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన చిత్రాలని బాలీవుడ్ లో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా రీమేక్ లతో పాటు సౌత్ అనువాద చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉత్తరాది వారు మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ సౌత్ రీమేక్ లలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలు రీమేక్ లు గా తెరపైకొచ్చి బాలీవుడ్ లోనూ రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం టాలీవుడ్ కు చెందిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు హిందీలో రీమేక్ అవుతుండగా తమిళం నుంచి ఓ మూవీ రీమేక్ అవుతోంది.
2019లో ఎలాంటి హీరోయిన్, డ్యూయెట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `ఖైదీ`. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. 2019 అక్టోబర్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని హిందీలో అజయ్ దేవ్‌గన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ధర్వేంద్ర శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. `నా తదుపరి చిత్రంగా `భోలా` చిత్రాన్ని చేస్తున్నందుకు గర్వంగా వుంది. వచ్చే ఏడాది 2023 మార్చి 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం` అని హీరో అజయ్ దేవ్‌గన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అజయ్ దేవ్‌గన్ ప్రొడక్షన్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. జనవరి లో షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి తాజాగా హీరో అజయ్ దేవ్ గన్ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇందులో మరో సర్ ప్రైజ్ కూడా వున్నట్టుగా తెలుస్తోంది. తమిళ వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ గా నరేష్ నటించారు. అతని పాత్రని హిందీ వెర్షన్ లో మాత్రం ఫిమేల్ ఆఫీసర్ గా మార్చినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఆ పాత్ర కోసం టబుని తీసుకున్నారట.
సినిమా అంతా కార్తి, నరేన్ ల నేపథ్యంలో సాగుతుందన్నది తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ ని మాత్రం మరింత క్రేజీగా వుండాలని నరేష్ పాత్రని మార్చి ఆ పాత్రలో టబుని నటింపజేస్తున్నారట. అజయ్ దేవ్‌గన్ టబు కలిజి ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో నటించారు. ఇటీవల దృశ్యం, దృశ్యం 2 ల్లోనూ టబు నటించిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్ తో `భోలా` కోసం కూడా టబుని ప్రధాన పాత్ర కోసం అజయ్ తీసుకున్నారట.
ప్రస్తుతం అజయ్ దేవ్‌గన్ నటించిన తెరకెక్కించిన `రన్ వే 34` చిత్రం రిలీజ్ కి రెడీ గా వుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అజయ్ పాల్గొంటున్నారు. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది