అన్నయ్యను దాటేందుకు తమ్ముడి పరుగులు

Update: 2016-11-04 16:26 GMT
కోలీవుడ్ హీరో సూర్య తెలుగులో కూడా పెద్ద హీరోనే. సినిమా బాగుండాలే కానీ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో వసూళ్లు సాధించేస్తుంటాడు. అన్ని సినిమాలు ఆడేయవు కానీ.. ఆడితే మాత్రం సూర్య సత్తా ఏంటో అర్ధమవుతుంది. ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తీ కూడా అన్నయ్య మార్కెట్ కు దాదాపు రీచ్ అయిపోతున్నాడు.

పరుత్తివీరన్ లో కార్తీ అరంగేట్రం చేసినపుడు.. అంతగా అంచనాలు ఏమీ లేవు. కానీ ఆ తర్వాత ప్రతీ మూవీకి తన రేంజ్ పెంచుకుంటున్నాడీ కుర్ర హీరో. అయిరాతిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు).. సిరుతై(విక్రమార్కుడు రీమేక్).. నాన్ మహాన్ అల్లా(నా పేరు శివ).. మద్రాస్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు.. హిట్స్ సాధించి తన స్థాయి కూడా పెంచుకున్నాడు. రీసెంట్ గా ఊపిరి మూవీలో అయితే తన ట్యాలెంట్ కి పరీక్ష పెట్టే రోల్ ని కూడా చేసి మెప్పించేశాడు.

ఇప్పుడు కాష్మోరా మూవీ సెన్సేషనల్ గా ఆడేస్తోంది. సూర్య సినిమాలు సూపర్ హిట్ అయితే ఈస్ట్ లో 1కోటి రూపాయల వసూళ్లు వస్తాయి. కార్తీ ఇప్పటికే దాదాపు 80లక్షలు సాధించేశాడు. ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకా ఎక్కువ మొత్తాన్నే వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ జనాలు. కొన్నేళ్లుగా సూర్య మార్కెట్ స్థిరంగా అక్కడక్కడే ఉంటే.. తమ్ముడు మాత్రం ప్రతీ సినిమాతోనూ తన రేంజ్ పెంచుకుని అన్నకు పోటీగా తయారైపోయాడు. ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తే మాత్రం.. టాలీవుడ్ మార్కెట్ వరకూ అన్నయ్యను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News