కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇటీవలే 'పొన్నియన్ సెల్వన్' మొదటి భాగంతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కార్తీ కెరీర్ లో మరో పీరియాడిక్ హిట్ ఇది. సినిమాలో కార్తీ పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సక్సెస్‌లలో ఒకటిగా నిలిచింది.
స్టిల్ పొన్నియన్ సెల్వన్ వార్ బాక్సా ఫీస్ వద్ద ఇంకా కొనసాగుతోంది. ఇదే వేడిలో కార్తీ కొత్త 'సర్దార్' సైతం జైత్రయాత్రకి రెడీ అవుతోంది. 'సర్దార్'ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్దం అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ లో కార్తీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కార్తీ డైరెక్షన్ ప్లానింగ్ ప్రశ్న రెయిజ్ అయినప్పుడు! తన మొదటి హీరో ఎవరంటే? ఠకీమని అన్నయ్య సూర్య పేరు చెప్పాడు.
తనని నమ్మి హీరోగా చేయడానికి అన్నయ్య మాత్రమే ముందుకు వస్తాడని నవ్వేసారు. తనకి డేట్లు ఇచ్చేది సూర్య మాత్రమేనని అన్నారు. అయితే ప్రస్తుతానికి దర్శకత్వానికి సంబంధించి ఎలాంటి పటిష్టమైన ప్రణాళికలు లేవని తెలిపారు. సూర్య కారణంగానే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు. 'నా చేయి పట్టుకుని పరిశ్రమలోకి తీసుకొచ్చాడు.
ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేసే నటుడు అతను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని అయినప్పటి నుంచి అన్నకు దర్శకత్వం వహించాలని అనుకున్నాను. అతను నన్ను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి అతనితో పని చేయడం కూడా సులభంగా ఉంటుంది. నేను ఏదైనా విషయంపై కన్ఫ్యూజన్‌లో ఉన్నా.. క్షణాల్లో అర్థం చేసుకుంటాడు' అని కార్తీ అన్నారు. మొత్తానికి కార్తీ అన్నయ్యని ఏదో ఒక రోజు డైరెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
కోలీవుడ్ లో ఇద్దరు ట్యాలెటెండ్ పర్సనాల్టీలు. యాక్టింగ్ పరంగా ఒకరికొకరు పోటీ పడి నటిస్తారు. ఇంత వరకూ ఒకే ప్రేమ్ లో కనిపించేదు గానీ అదే జరిగితే ఇద్దరి మధ్య రీల్ వార్ మామూలుగా ఉండదు. ఆ తరహా ప్రయత్నం టాలీవుడ్ మేకర్స్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కోలీవుడ్ నటులైనా? టాలీవుడ్ సొంత బిడ్డల్లా ఆదరిస్తుంది. తెలుగు నాట ఆ ఇద్దరికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ..గుర్తింపు ఉంది. కోలీవుడ్ దర్శక..హీరోలంతా టాలీవుడ్ బాడ పడుతోన్న తరుణమిది. ఇదే సమయంలో బ్రదర్స్ ఎంట్రీ ఇస్తే అదుర్సే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.