కొన్ని అంతే. కాకతాళీయంగా జరిగినా రెండు వేర్వేరు సంఘటనలకు కనెక్షన్ దొరికి ఆశ్చర్యం కలిగించేలా చేస్తాయి. అలాంటిదే ఇది కూడా. గత ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయంకు తాజాగా ఎన్నికల కమీషన్ టార్చ్ లైట్ గుర్తుని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కార్తీకి ఏం కనెక్షన్ ఉంది అనుకుంటున్నారా . అక్కడే ఉంది మతలబు. ఏడేళ్ల క్రితం 2012లో కార్తీ హీరోగా శకుని అనే సినిమా ఒకటి వచ్చింది గుర్తుందిగా.
అందులో కార్తీ కోట శ్రీనివాసరావు పార్టీకి మద్దతుదారుగా కనిపిస్తాడు. దాని గుర్తు టార్చి లైటే ఉంటుంది. విచిత్రమేమిటంటే అందులో కార్తీ పేరు కమల్. చిత్రంగా ఉంది కదా. కమల్ పేరుతో కార్తీ ఒక రాజకీయ పాత్ర చేయడం అతను పని చేసే పార్టీ గుర్తు టార్చ్ లైట్ ఉండటం విచిత్రం కాక మరేమిటి. దీన్నే ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి తెచ్చేశారు.
కమల్ గారి అభిమాని కాబట్టే విధి ఇలా ఏడేళ్ల క్రితమే నటింపజేసిందని కమల్ ఫ్యాన్స్ అంటే మా హీరో భవిషత్తుని కూడా ఊహించే సినిమా చేసాడని కార్తీ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. దెబ్బకు మిగిలినవాళ్ళు ఇప్పుడా శకుని సినిమా ఆన్ లైన్ లో చూసి మరీ ఈ విషయాన్నీ ఖరారు చేసుకుంటున్నారు. మంచి పొలిటికల్ డ్రామాగా సాగే శకుని అప్పట్లో ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమిళ్ లో ఓ మాదిరిగా ఆడినా తెలుగులో ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఈ రూపంలో శకుని మరోసారి చర్చలోకి రావడం విశేషమే