సీక్వెల్ తీయ‌‌కుండా ల‌ఘు చిత్రం ఎందుకు?

Update: 2020-05-11 03:45 GMT
ద‌శాబ్ధం క్రితం అందాల స‌మంత‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తూ నాగ‌చైత‌న్య హీరోగా ఏమాయ చేశావే చిత్రం తీశాడు గౌత‌మ్ మీన‌న్. క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు మంచి మార్కులే వేశారు. అయితే ఇదే క‌థ‌తో శింబు- త్రిష జంట‌గా సైమ‌ల్టేనియ‌స్ గా `విన్నైతాండి వ‌రువాయ‌` (26 ఫిబ్ర‌వ‌రి 2010 రిలీజ్) చిత్రాన్ని త‌మిళంలో తెర‌కెక్కించాడు ట్యాలెంటెడ్ గౌత‌మ్ మీన‌న్. అక్క‌డ ఇక్క‌డ నాయ‌కానాయిక‌లు మారారు. రెండు చోట్లా సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది.

ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ కార్తీక్ .. ద‌ర్శ‌కుడు కావాల‌ని క‌ల‌లు గంటూ కెరీర్ కి.. ప్రేమ‌కు మ‌ధ్య న‌లిగి పోతాడు. ప్రేయ‌సి కోసం కెరీర్ ని వ‌దిలేయాలా?  లేక ప్రేమ‌ను కెరీర్ ని రెండిటినీ గెలుచుకోవాలా? అన్న సందిగ్ధ‌త ఆ పాత్ర‌లో ఉంటుంది. ప్రేమికుల మ‌ధ్య ఉండే ల‌వ్ ఎమోష‌న్ గొడ‌వ‌లు అన్నిటినీ ఎంతో ఉద్విగ్నంగానే చూపించారు.

అయితే త‌మిళ వెర్ష‌న్ క్లైమాక్స్ లో ప్రేమికులు క‌ల‌వ‌రు.. తెలుగు వెర్ష‌న్ లో మాత్రం ప్రేమ‌గువ్వ‌లు క‌లిసిపోతారు. మ‌న క‌థ‌లు సుఖాంతం కావాలి కాబ‌ట్టి ఆ నియ‌మాన్ని గౌత‌మ్ మీన‌న్ పాటించాడు. తెలుగు వెర్ష‌న్ ఏమాయ చేశావేని మంజుల ఘ‌ట్ట‌మ‌నేని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అదంతా స‌రే కానీ ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాన‌ని ప్ర‌క‌టించినా ఇప్ప‌టివ‌ర‌కూ గౌత‌మ్ నుంచి ఆ ప్ర‌య‌త్నం క‌నిపించ‌లేదు.

తాజాగా లాక్ డౌన్ ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ `విన్నైతాండి వ‌రువాయ`కు సీక్వెల్ గా ఓ ల‌ఘు చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం ఆస‌క్తిని రేపుతోంది. కార్తీక్ డ‌య‌ల్ సెయ్‌దా యెన్ అనేది ఈ షార్ట్ ఫిలిం టైటిల్. ఇందులో త్రిష య‌థావిధిగా క‌థానాయిక‌గా న‌టించింది. తాజాగా రిలీజ్ చేసిన ల‌ఘు చిత్ర‌ టీజ‌ర్ లో త్రిష పాత్ర‌ను ఎలివేట్ చేశారు. ఇక ఈ లఘు చిత్ర క‌థ‌ను లాక్ డౌన్ కాలంతో ముడిపెట్టి రాయ‌డం ఇంట్రెస్టింగ్. లాక్ డౌన్ వేళ కార్తీని తిరిగి జెస్సీ క‌లుస్తుందా క‌ల‌వ‌దా?  అస‌లేం జ‌రుగుతుంది? అన్న‌ది స‌స్పెన్స్. జెస్సీ పాత్ర‌ధారి (త్రిష‌) కార్తీక్ కు ఫోన్ చేసి త‌న సినిమా కెరీర్‌ గురించి విచారిస్తోంది.

అంతేకాదు.. త్రిష చెప్పిన డైలాగ్ వింటే మునుముందు సినిమాలు తీసే ద‌ర్శ‌కుల కంటే వెబ్ సిరీస్ లు తీసే దర్శ‌కుల‌కే టైమ్ క‌లిసి రానుంద‌ని అర్థ‌మ‌వుతోంది. లాక్ డౌన్ కి భ‌య‌ప‌డ‌కు.. మ‌ళ్లీ మంచి రోజులొస్తాయి.. అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ఆదుకుంటాయి.. అంటూ త్రిష డైలాగ్ చెప్ప‌డం చూస్తుంటే గౌత‌మ్ మీన‌న్ మునుముందు వెబ్ సిరీస్ ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తార‌ని అర్థ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే ఈ ల‌ఘు చిత్రం రిలీజ్ కానుంది.Full View
Tags:    

Similar News