ప్రభుదేవా బేసిగ్గా డ్యాన్స్ మాస్టర్. డ్యాన్స్ మాస్టర్ గానే అతడి కెరీర్ మొదలైంది. కానీ తర్వాత నటుడి అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా డైరెక్షన్లోకి కూడా అడుగుపెట్టాడు. దర్శకుడిగా మారాక నటన గురించి ఆలోచించలేదు ప్రభు. ఒకటీ అరా సినిమాలు చేసినప్పటికీ.. ప్రధానంగా ఫోకస్ అంతా డైరెక్షన్ మీదే పెట్టాడు. ఐతే ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వాన్ని పక్కనబెట్టి మళ్లీ నటన మీద దృష్టి పెట్టాడు. గత ఏడాది త్రిభాషా చిత్రం ‘అభినేత్రి’లో నటించిన ప్రభుదేవా.. ఇప్పుడు తమిళంలో నటుడిగా రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ‘మెర్క్యురీ’ ఒకటి. ఇది ప్రభుదేవా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని భావిస్తున్నారు.
తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్టయిన ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుండటమే ‘మెర్క్యురీ’పై ఆసక్తిని పెంచుతోంది. ‘పిజ్జా’ తర్వాత ‘జిగర్ తండా’.. ‘ఇరైవి’ సినిమాలతోనూ మెప్పించాడు కార్తీక్. నాలుగో సినిమాను ధనుష్ హీరోగా చేయాల్సింది కానీ.. అది ఆలస్యమయ్యేలా కనిపించడంతో మధ్యలో ‘మెర్క్యురీ’కి శ్రీకారం చుట్టాడు కార్తీక్. ప్రభుదేవా డ్యాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పేటపుడు పాదరసంలా కదులుతున్నాడని అంటాం. మరి ఈ చిత్రానికి ‘మెర్క్యురీ’ అనే టైటిల్ పెట్టారంటే డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమా అనుకుంటాం. కానీ ఇదొక సైలెంట్ థ్రిల్లర్ అంటున్నాడు కార్తీక్. దీని ఫస్ట్ లుక్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘24’.. ‘జనతా గ్యారేజ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. కొత్తదనం కోసం తపించే కార్తీక్ దర్శకత్వంలో ప్రభుదేవా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/