రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు కథ చెప్పి ఒప్పించడం అంటే అంత ఆషామాషీ వ్యవహాం కాదు. కోట్లలో డీలింగ్ . చిన్న తేడా వచ్చినా క్రెడిబిలీటి పోతుంది. అందుకే.. రజనీ కాంత్ కూడా మొన్నటివరకు సీనియర్ డైరెక్టర్లకే అవకాశం ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు రజనీ మారాడు. కొత్త పాయింట్ తో వచ్చే దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. ఇదే కోవలో పిజ్జా, జిగరతాండా సినిమాతో మెప్పించిన కార్తీక్ సుబ్బరాజుకి అవకాశం ఇచ్చాడు. కార్తీక్ కు అవకాశం ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఓ చిన్న స్టోరీ లైన్ తో రజనీకాంత్ ని పడేశాడు కార్తీక్. అదే బాషా స్టోరీ.
బాషా సినిమాలో రజనీకాంత్ పేరు మాణిక్యం. చరణ్ రాజ్ పేరు బాషా. చరణ్ రాజ్ చనిపోయిన తర్వాత తన పేరుని మాణిక్ బాషాగా మార్చుకుంటాడు రజనీ. ఫస్టాఫ్ అంతా అజ్ఞాతవాసం, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ తర్వాత నిజం తెలీడం.. ఇదంతా ఆ తర్వాత ఒక ఫార్ములాగా మారిపోయింది. ఇక్కడే.. ఇదే సెంటిమెంట్ పై రజనీకాంత్ ని పడేశాడు సుబ్బరాజు. బాషా స్టోరీనే కాస్త పేర్లు మార్చి సెట్ చేశాడు. ఇందులో కూడా అంతే. రజనీ హిందువు, రజనీ ఫ్రెండ్ ముస్లిం. ఫ్రెండ్ చనిపోతే.. అతడి కోసం పగ తీర్చుకనే కేరక్టర్. ఇక ఫస్టాఫ్ అంతా అజ్ఞాతవాసి ముసుగు. దీంతో.. ఈ సినిమా కూడా బాషా రేంజ్ లో హిట్ అయిపోతుందని ఆశపడిన రజనీ.. వెంటనే కార్తీక్ సుబ్బరాజుకి అవకాశం ఇచ్చాడు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. రజనికాంత్ ఆశలన్నీఆడియాశలయ్యాయి.
Full View