మాజీ హీరోయిన్ రాధ కూతురిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన భామ కార్తీక. జోష్ మూవీతో నాగ చైతన్యతో కలిసి తొలిసారిగా తెరపై మెరిసిన ఈ భామ.. ఆ తర్వాత తమిళ్ మూవీ కో(తెలుగులో రంగం) చిత్రంతో సక్సెస్ సాధించింది. తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో నటించినా ఈ చిన్నదానికి కలిసి రాలేదు.
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అంటూ అల్లరి నరేష్ కి చెల్లెలిగా మూడేళ్ల క్రితం టాలీవుడ్ తెరపై కార్తీక మెరిసిందంతే. మళ్లీ ఈమె తెలుగు సినిమా గురించి మాటా మంతీ వినిపించలేదు. అయితే.. గతేడాది ఈమె దగ్గరకు ఓ మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్ రావడం.. కార్తీక అంగీకరించడం.. ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేయడం.. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ చేయడం కూడా జరిగిపోయాయట. 'ఈ సినిమాలో నేను మహిళా సాధికారిత కోసం పోరాడే స్ట్రాంగ్.. పవర్ ఫుల్ ఉమన్ గా కనిపిస్తాను. కానీ ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల గురించి మాత్రం ఇప్పుడప్పుడే ఏం చెప్పలేదు. ఈ నెలాఖరుకు గానీ.. మే నెల మొదటివారంలో గానీ.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడచ్చు' అని చెప్పింది కార్తీక.
ఈ మూవీ స్టోరీ రైటర్ ఎవరో తెలిసినప్పుడు అందరూ షాక్ తినేస్తారంటోంది కార్తీక. ఇప్పటివరకూ ఈమె చేసిన పాత్రలన్నీ సినిమా కథలో కీలకంగా ఉంటుండడం విశేషం. తను రోల్స్ ను ఎంచుకోనని.. అలా జరగడం తన అదృష్టం అంటోంది జోష్ భామ కార్తీకా నాయర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/