తెలుగులో హీరోగా కార్తికేయ తన సత్తా చాటుకుంటూనే, తమిళంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. 'వలిమై' సినిమాలో సూపర్ స్టార్ అజిత్ తో ఆయన తలపడ్డాడు. అజిత్ సినిమాలో విలన్ పాత్ర దక్కడమనేది, కోలీవుడ్ లో హీరోగా ఛాన్స్ రావడం కంటే కూడా కష్టమైనది.
అలాంటి అవకాశాన్ని కెరియర్ తొలినాళ్లలోనే కార్తికేయ సొంతం చేసుకోవడం విశేషం. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ నెల 24వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 'భీమ్లా నాయక్'కి ఒక రోజు ముందు ఈ సినిమా వస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. బోనీ కపూర్ .. హుమా ఖురేషి .. కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ .. " బోనీ కపూర్ గారితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటున్నాను. ఇక హుమా ఖురేషి గారికి ఇక్కడ కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు, నా ఫ్రెండ్స్ అంతా కూడా ఆమె గురించే అడుగుతూ ఉండేవారు.
హుమ్ ఖురేషిని కలిశావా? ఆమెతో మాట్లాడావా? అంటూ ఎంతో ఆసక్తితో అడిగేవారు. అవును అని చెప్పడానికే ఇప్పటి వరకూ ఆమె పక్కనే కూర్చున్నాను. ఇకపై ఆమె తెలుగులో కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 24న 'వలిమై' రిలీజ్ అవుతోంది .. మనందరికీ తెలుసు 25న ఏం వస్తుందో. ఆ రోజున 'భీమ్లా నాయక్' వస్తోంది. పవన్ సినిమా వస్తుందంటే ఇక్కడి మాస్ ఆడియన్స్ లో ఎలాంటి సందడి ఉంటుందో, తమిళనాడులో అజిత్ సినిమా వస్తుందంటే అక్కడ అంతే హడావిడి ఉండటం నేను చూశాను.
ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తుండటం .. ఒక స్వీట్ మూమెంట్. 24వ తేదీన 'వలిమై' చూడండి .. 25న 'భీమ్లా నాయక్' చూడండి .. 26 నుంచి రెండు సినిమాలు చూస్తూనే ఉండండి. పవన్ అభిమానులంతా అజిత్ గారి సినిమాను సపోర్ట్ చేయాలి.
బాక్సాఫీస్ కి పట్టిన తుప్పంతా వదిలించి వేయాలి. ఈ సినిమాను 24వ తేదీన థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో విలన్ గా కార్తికేయ ఎలా విజృంభించాడనేది చూడటానికి తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిని కనబరుస్తున్నారు.