దేవ‌ర‌కొండ హిందీ క్రెడిట్ ని నిఖిల్ కొట్టేస్తున్నాడా?

Update: 2022-08-14 15:38 GMT
`ఆర్ ఆర్ ఆర్`..`మేజర్`..`ఎఫ్‌-3` చిత్రాల స‌క్సెస్ ట్రాక్ ని అటుపై రిలీజ్ అయిన చిత్రాలు కొన‌సాగించ‌లేక‌పోయి. భారీ అంచనాల మ‌ధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల‌న్ని డిజాస్ట‌ర్ గానే మిగిలిపోయాయి.  జూన్- జూలై నెలల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ చెప్ప‌కోద‌గ్గ చిత్రాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద క‌నిపించ‌లేదు. అయితే ఆగ‌స్టు లో మాత్రం మ‌ళ్లీ స‌క్సెస్ ఊపు క‌నిపించింది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన `బింబిసార`.. `సీతా రామం` బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన చిత్రాలు ఈ రేంజ్లో స‌క్సెస్ అవుతాయ‌ని ఊహించ‌లేదు. ఇది మిరాకిల్ అని చెప్పాలి.  ముందు నుంచి  మంచి బ‌జ్ క్రియేట్ చేసుకున్న‌  `కార్తికేయ 2` మాత్రం వాటిని నిల‌బెట్టుకోవ‌డంలో నూరుశాతం స‌క్సెస్ అయింది.

పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయినా సినిమాకి అన్ని భాష‌ల్లోనూ దూసుకుపోతుంది. హిందీ బెల్డ్ లో సైతం సినిమా పుంజుకుంటుంది. పాజిటివ్ టాక్ నేప‌థ్యంలో అక్క‌డ థియేట‌ర్ల సంఖ్య పెంచుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇది నార్త్ నుంచి కార్తికేయ‌-2కి ఊహించ‌ని ఫ‌లితంగా చెప్పొచ్చు.  పుష్ప త‌ర‌హాలోనే అక్క‌డ కార్తిక‌యే-2 విష‌యంలో బాక్సాఫీస్ వ‌ద్ద మిరాకిల్ జ‌ర‌గ‌డానికి ఆస్కారం  ఉంది.

టాలీవుడ్ కంటెంట్ విష‌యంలో  నార్త్ ఆడియ‌న్స్ పాజిటివ్ గా ఉంటున్నారు. హిందీ సినిమాల క‌న్నా తెలుగు సినిమాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. రెండేళ్ల‌గా స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌త‌మ‌వుతోన్న బాలీవుడ్ `లాల్ సింగ్ చ‌ద్దా`..`ర‌క్షాబంధ‌న్` ఫ‌లితాల‌తోనైనా తేరుకుంటుంద‌ని అంచ‌నాలు పెట్టుకున్నారు.  కానీ వాటిని అమీర్ ఖాన్..అక్ష‌య్ కుమార్ ఒమ్ము చేసారు.

దీంతో బాలీవుడ్ ఆశ‌ల‌న్నీ విజ‌య్ దేవ‌ర‌కోండ న‌టించిన `లైగ‌ర్` పైనే మొద‌ల‌య్యాయి. బాలీవుడ్ లో లైగ‌ర్ భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. పైగా  నిర్మాణంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్  భాగం కావ‌డంతో స్పాన్ మ‌రింత పెరిగింది. నేరుగా ఓ  హిందీ సినిమా రిలీజ్ జ‌రుగుతున్నంత హ‌డావుడి లైగ‌ర్ విష‌యంలో చోటు చేసుకుంది. దీంతో  హిందీలో కొడితే లైగ‌ర్ మాత్రమే కొట్టాల‌ని ట్రేడ్ సైతం భావించింది.

అయితే అంత‌కు ముందే కార్తికేయ‌-2 హిందీలో కూడా పాజిటివ్ సైన్ తో దూసుకుపోవ‌డం విశేషంగా చెప్పొచ్చు. వీడీ కి ద‌క్కాల్సిన ఈ క్రెడిట్ ని నిఖిల్ కొట్టేశాడు అంటూ టాక్ స్ర్పెడ్ అవుతుంది. `కార్తికేయ 2` హిందీ ప్రాంతాలలో ప్యాక్డ్ హౌస్‌లను రికార్డ్ చేస్తోంది. ప్రతి నిమిషానికి షోలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ రివ్యూలు..ఫీడ్ బ్యాక్ లు పాజిటివ్ గా వ‌స్తున్నాయి. `పుష్ప` - `ఆర్ ఆర్ ఆర్` తర్వాత హిందీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు చిత్రంగా నిలుస్తుంది. 
Tags:    

Similar News