పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన కార్తికేయ-2 బాక్సాఫీస్ దుమారం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ని సైతం యంగ్ హీరో నికిల్ సిద్దార్ధ్ తనదైన శైలిలో రఫ్పాడించేస్తున్నాడు. 50 థియేటర్లలో రిలీజ్ అయినా వేయి..రెండు వేల థియేటరల్కు పాకిందంటే? కార్తికేయ-2 హిందీ బెల్ట్ లో ఏ స్థాయిలో విజయాన్ని నమోదు చేసిందో అద్దం పడుతుంది.
కృష్ణతత్వం బేస్ మీద తెరకెక్కిన సినిమా అనూహ్యంగా ఉత్తరాది అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. స్టిల్ ఇప్పటికీ కార్తికేయ-2 థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే? అతి శయోక్తి కాదు. ఈ సినిమా ద్వారా హిందుత్వం ప్రభావం ఉత్తరాది రాష్ర్టాల్లో ఎంత బలంగా ఉందన్నది అర్ధమవుతుంది. తాజాగా హిందీలో కార్తికేయే -2 మరో అరుదైన ఘనత సాధించింది.
హిందీ డబ్బింగ్ వెర్షన్ తెలుగు చిత్రాల్లో 'కార్తికేయ-2' టాప్ 10 లో స్థానం దక్కించకుంది. అదీ కూడా ఫైనల్ రన్ పూర్తి కాకుండా ఈ స్థానంలో నిలబడటం అన్నది సంచలనంగానే చెప్పాలి. ఇంకా చెప్పాంటే సౌత్ హీరోల సైతం నికిల్ పక్కకు నెట్టేసాడని తెలస్తోంది. ఇప్పటివరకూ వసూళ్ల పరంగా హిందీలో పదవ స్థానంలో ఉన్న కబాలి చిత్రాన్ని కార్తికేయ-2 నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించింది.
'కబాలీ' హిందీలో 28 కో ట్ల వసూళ్లని సాధించగా.. 'కార్తికేయ-2'..29 కోట్ల వసూళ్లతో కబాలీని క్రాస్ చేయడంతోనే ఈ రికార్డు సాధ్యమైంది. ఇంకా మాధవన్ రాకెట్రీ సైన్స్ 'ది నంబీ ఎఫెక్ట్'.. 'రాధేశ్యామ్' చిత్రాల వసూళ్లని సైతం నిఖిల్ క్రాస్ చేసాడు. ఈ నేపథ్యంలో 'కార్తికేయ-2'కి కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది. పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ -2' వసూళ్లని బ్రేక్ చేయడమే కనిపిస్తుంది.
అయితే ఇదంత సులభం కాదు. కేజీఎఫ్-2 హిందీలో నే 44 కోట్ల వసూళ్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ సినిమా వసళ్లని గనుక బీట్ చేస్తే సౌత్ సినిమా పరంగా కార్తికేయ-2 ఓ హిస్టరీగానే భావించాలి. కేవలం కంటెంట్ తో థియేటర్లో ఆడుతోన్న సినిమా మినహా హీరో ఇమేజ్ తో నడుస్తోన్న సినిమా కాదిది. ఆ రకంగా తెలుగు సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
ఇక ఈ వారం లో పాన్ ఇండియా వైడ్ బ్రహ్మాస్ర్త రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయని బాలీవుడ్ నమ్మకం పెట్టుకుంది. సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక కార్తికేయ-2 నెమ్మదిస్తుంది. అలా కాకుండా జరిగితే గనుక ఈ వారం కూడా కార్తికేయదే అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.