కొంతకాలంగా కార్తికేయకి హిట్ లేకపోవడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. కథాకథనాలపై కూడా ఈ సారి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. దర్శకుడు కొత్తనే అయినా, కథలో వైవిధ్యం ఉండటం వలన 'రాజా విక్రమార్క' సినిమాను చేశాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
"ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే తప్పకుండా పాటలు .. ఫైట్లు ఉండవలసిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రీసెంట్ గా 'డాక్టర్' సినిమాను చూశాను .. చాలా బాగా అనిపించింది. అరే భలేవుందే .. ఇలాంటి సినిమాలు మనం చేయాలి అనిపించింది. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారమే మనం కూడా మారుతూ ముందుకు వెళ్లాలి. నేను చేసిన సినిమాల్లో ఏవైతే పోయాయో అందుకుగల కారణాలను నేను నోట్ చేసుకుంటాను .. ఆ తరువాత అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను.
నా సినిమాలు సరిగ్గా ఆడకపోతే అందుకు వేరెవరో బాధ్యులని నేను చెప్పను. ఆ సినిమాల పరాజయాలను .. అందుకు గల కారణాలను నేను స్వీకరిస్తాను. సరిగ్గా ఆడని సినిమాలను ఎవరైనా పొగడడం కూడా నాకు నచ్చదు. 'చావు కబురు చల్లగా' తరువాతనే నాకు అర్థమైంది .. మార్కెట్ కోసం పరిగెత్తకుండా మంచి కథకులను ఎంచుకోవాలని. 'చావు కబురు చల్లగా' తరువాతనే నాకు నేను రియలైజ్ అయ్యాను. తరువాత సినిమాలను యూవీ క్రియేషన్స్ .. శ్రీదేవి మూవీస్ బ్యానర్లలో చేయనున్నాను. ఒక కొత్త దర్శకుడికి కూడా ఓకే చెప్పాను. అవన్నీ కూడా కూడా డిఫరెంట్ జోనర్లకు చెందినవే.
తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే 'వలిమై' రిలీజ్ అయిన తరువాత చూద్దామని ఆగాను. 'వలిమై'లో ఇంతవరకూ చేయని ఫైట్స్ అయితే చేశాను. సౌత్ ఇండియా సినిమాల్లో అంత రిస్కీ షాట్స్ ను నేను చూడలేదు .. మేకింగ్ సమయంలో నేనే ఆశ్చర్యపోయాను. బైక్ రేసింగ్ ఎపిసోడ్స్ లో అజిత్ తో పోటీపడటం చాలా కష్టం. షూటింగు సమయంలో నా కళ్ల ముందే ఆయన బైక్ పై నుంచి పడిపోయాడు. అప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నా సర్కిల్ పెరుగుతోంది. నా గురించి అందరూ మంచిగా చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది.
నా ఫిజిక్ బాగుంటుందని అంతా అంటుంటారు .. అందువలన దానిని జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తుంటాను .. నిజం చెప్పాలంటే నా ఫిజిక్ వల్లనే నాకు 'ఆర్ ఎక్స్ 100'లో ఛాన్స్ వచ్చింది. ఇటు 'రాజా విక్రమార్క'లోను .. అటు 'వలిమై'లోను నా ఫిజిక్ చూసే నన్ను తీసుకున్నారు. 'రాజా విక్రమార్క' కథ మొదటి నుంచి చివరివరకూ పరుగెడుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా కథ స్లో అయినట్టుగా అనిపించదు. ఒక్కమాట మాత్రం బలంగా చెప్పగలను .. ఎక్కడా కూడా బోర్ అనిపించదు. మేకింగ్ ను చూస్తే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా చూసిన తరువాత కూడా అంతా అదేమాట అంటారు" అని చెప్పుకొచ్చాడు.