ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అలాగే విడుదల అవ్వడం కూడా భారీ అంచనాలతో విడుదల అవుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలో బాగా బజ్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది 'చావు కబురు చల్లగా'. ఈ సినిమాకు ఫస్ట్ నుండి కూడా అటు పోస్టర్ లతో ఇటు పాటలతో ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆఖరికి సినిమా ట్రైలర్ అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. పక్కా హిట్టు అనే టాక్ నడిచింది. మార్చ్ 19న సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో.. ఫస్ట్ డే థియేటర్ టాక్ మాత్రం నెగటివ్ వచ్చింది. మొత్తానికి సినిమా ప్లాప్ గా నిలిచింది. అయితే హీరో కార్తికేయ కెరీర్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమా ఇదే.
'ఆర్ఎక్స్100' సినిమా పేరు చెప్పుకొనే ఇంకా కార్తికేయ నెట్టుకొస్తున్నాడు. ఇది హిట్ అయితే ఆ సినిమా మంచి రిలీఫ్ దొరుకుతుందని భావించాడు. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా.. సినిమా డిజాస్టర్ అయ్యేసరికి మళ్లీ 'ఆర్ఎక్స్100' కార్తికేయ అని చెప్పుకోక తప్పేలా లేదు. తాజాగా 'చావుకబురు చల్లగా' సినిమా ప్లాప్ అవ్వడంతో హీరో కార్తికేయ ట్విట్టర్ వేదికగా మరో అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు. కార్తికేయ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా ఫలితం పక్కనపెడితే నటుడుగా నాలో మరోకోణం బయటపెట్టింది. అలాగే కొందరి మనసులకు కూడా బాగా దగ్గరైంది. నిజానికి బస్తీ బాలరాజ్ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉంది. కానీ సినిమా నచ్చని వారు తప్పకుండా క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఈసారి ఖచ్చితంగా తప్పులను రిక్టీఫై చేసి బౌన్స్ బ్యాక్ అవుతానని' చెప్పుకొచ్చాడు. సినిమా ప్లాప్ అయిందని హీరో ఇలా స్పందించడం పై సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.