నిఖిల్ నటించిన మిస్టిక్ ఫాంటసీ థ్రిల్లర్ 'కార్తికేయ 2'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జవి. విశ్వప్రసాద్ తో కలిసి ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ కీలక అతిథి పాత్కలో నటించారు.
రెండు దఫాలుగా రిలీజ్ వాయిదా పడి మొత్తానికి ఆగస్టు 13న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలైన 'కార్మికేయ 2'ని గతంలో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్ గా తెరకెక్కించారు. కృష్ణతత్వం, కృష్ణుడి అవతారం ముగింపు, ద్వారా సముద్రగర్భంలో కలిసిపోవడం వెనకున్న మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ నార్త్ లో మాత్రం రికార్డుల మోత మోగిస్తోంది.
ముందు అత్యంత తక్కువ థియేటర్లలో విడుదలైన 'కార్తికేయ 2' ఇప్పుడు రికార్డు స్థాయి థియేటర్లకు చేరి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే కనీ వినీ ఎరుగని ఫిగర్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా రూ. 110 కోట్ల మార్కుని దాటిన ఈ మూవీ ఉత్తరాది బెల్ట్ లో డ్రీమ్ రన్ ని కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం విశేషం.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో రన్నవుతున్న ఈ మూవీ ప్రస్తుతం నాలుగవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయినా సరే ఎక్కడా జోరు తగ్గకుండా మ్యాజిక్ ఫిగర్ల ని త్వరలోనే సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే ఇప్పటికే యుఎస్ లో మిలియన్ డాలర్ మార్కుని దాటిన ఈ మూవీ త్వరలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయం అనే సంకేతాలు వినిపిసిస్తున్నాయి.
వరల్డ్ వైడ్ గా 'కార్తికేయ 2' ఇదే తరహా డ్రీమ్ రన్ కొనసాగిస్తుండటంతో రానున్న రోజుల్లో ఊహకందని ఫిగర్లని ఈ మూవీ రీచ్ కావడం లాంఛనమే అని ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.