కరోనాపై పోరాటంలో సామాన్య ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సామాన్య ప్రజలకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వాళ్ళను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు - ఛారిటీలు ముందుకు వచ్చి లబ్దిదారులకు బియ్యం, పప్పు వంటి నిత్యావసరాలు అందించడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేశారు విజయ్ . 25లక్షల రూపాయలతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఎవరికైనా thedeverakondafoundation.org వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికి నిత్యావసర సరుకులు అందిస్తారని.. ఇలా 2000 కుటుంబాల అవసరాలని ఈ ఛారిటీ ద్వారా తీర్చబోతున్నట్లు విజయ్ తెలిపాడు.
అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి.డి.ఎఫ్)’ను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరవాత సహాయం పొందినవారు తమకు వీలైతే మళ్లీ ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’కు విరాళం ఇవ్వొచ్చని.. దీని వల్ల మరికొంత మందికి సహాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయ్ దేవరకొండ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారని.. ఈసారి ఎవ్వరూ పట్టించుకోని మిడిల్ క్లాస్ గురించి ఆలోచించారని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫండ్ కు తన వంతుగా లక్ష రూపాయల సాయం చేసాడు RX 100 ఫేమ్ కార్తికేయ. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ ‘మాటల్లేవ్ విజయ్ దేవరకొండ అన్న. నీ నిర్ణయానికి వందనం. మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు. నా వంతుగా రూ.1 లక్ష అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని విన్నవిస్తున్నాను’ అని కార్తికేయ పేర్కొన్నారు.. ఇక దర్శకుడు కొరటాల శివ విజయ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ.. 'లవ్ యౌ బ్రదర్ .. పదిమందికి తోడుగా ఉండే పనుల్లో నీకు తోడుగా నేనుంటా.. మంచితో కుమ్మేద్దాం.. త్వరలోనే కలుద్దాం' అని ట్వీట్ చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన పనిని మెచ్చుకున్నాడు.