బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తో యువహీరో కార్తీక్ ఆర్యన్ బిగ్ ఫైట్ గురించి తెలిసిందే. అంతకుముందు 2021లో కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ ల మధ్య పూర్తిగా చెడిందన్న వార్త బాలీవుడ్ లో ప్రకంపనం అయ్యింది. ఆ ఇద్దరి కలయికలో `దోస్తానా 2` చిత్రం 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక.. అర్థాంతరంగా నిలిచిపోయేందుకు ఈ వివాదం కారణమైంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని కథనాలొచ్చాయి.
ఆ తరవాత అదే రోల్ కోసం మరో హీరోని కరణ రీప్లేస్ చేసారు. ధర్మ ప్రొడక్షన్స్ ఈ పతనానికి కారణం ఏమిటో చెప్పనప్పటికీ భవిష్యత్తులో కార్తీక్ తో ధర్మ ప్రొడక్షన్స్ పని చేయదని కరణ్ అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్ స్థానంలో రాజ్ కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ- రాజ్ కుమార్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. మిస్టర్ అండ్ మాహీ అనే టైటిల్ ని ఎంపిక చేయడం ఆసక్తికరం. టైటిల్ కి తగ్గట్టే ఫన్ ఫిల్డ్ మూవీ ఇది.
అయితే అప్పట్లో కార్తీక్ ఆర్యన్ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గుంభనగా ఉండిపోయాడు. తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ తో చెడిన వ్యవహారంపై కార్తీక్ మౌనం వీడాడు. “నేను నా పనిపైనే దృష్టి పెడుతున్నాను” అని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. పరిశ్రమ వ్యక్తులతో ఉన్న విభేదాలతో చిక్కులు లేవా? అని ప్రశ్నించగా.. ఇలా స్పందించాడు,
"నేను నా పనిపైనే దృష్టి పెడుతున్నాను. దీనిపై నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. నా సినిమాల లైనప్ చూడండి.. అని అన్నాడు. ఇండస్ట్రీ జనాలు తనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయడంపై కూడా అతను మరింత రెచ్చిపోయాడు. "ఏమిటో ఇది.. కొన్నిసార్లు ప్రజలు 'బాత్ కా బతంగద్' (ఒక పర్వతం నుండి పర్వతాన్ని తయారు చేస్తారు) చేస్తారు. అంతకుమించి ఏమీ లేదు. ఎవరికీ అంత సమయం లేదు..అంతగా ఆలోచించడానికి. ప్రతి ఒక్కరూ పని చేయాలని,.. మంచి పని చేయాలని కోరుకుంటారు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే... అంటూ వెల్లడించాడు.
ఇంతకుముందు ధర్మ ప్రొడక్షన్స్ కార్తీక్ ని దోస్తానా 2 నుంచి తొలగిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది. "వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా మేము గౌరవప్రదమైన నిశ్శబ్దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాము - కొలిన్ డి'కున్హా దర్శకత్వంలో దోస్తానా 2ని మళ్లీ ప్రారంభిస్తాము. దయచేసి త్వరలో అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి” అని పేర్కొంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా 2ని ప్రమోట్ చేస్తున్నాడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ- టబు కూడా నటించారు. షెహజాదా.. కెప్టెన్ ఇండియా .. ఫ్రెడ్డీ కూడా కార్తీక్ క్యూలో ఉన్న చిత్రాల జాబితా.