ఈ ఏడాదిలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం అల వైకుంఠపురంలో. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసిన అల వైకుంఠపురంలో చిత్రంను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ తీసుకోవడంతో పాటు చర్చలు కూడా మొదలు పెట్టింది.
ఈ విపత్తు వచ్చి పడకుంటే ఇప్పటి వరకు హిందీ అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ పట్టాలెక్కేది. షాహిద్ కపూర్ తో పాటు పలువురు హీరోలను ఈ రీమేక్ కోసం సంప్రదించారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రీమేక్ లో తాను నటించాలని కోరుకుంటున్నాను అంటూ బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పేర్కొన్నాడు. నెట్ ప్లిక్స్ లో సినిమాను చూశాను. ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంది. అల్లు అర్జున్ అద్బుతంగా నటించాడంటూ కితాబు ఇచ్చాడు.
రీమేక్ లో మరెవ్వరిని ఊహించుకోలేక పోతున్నాను అంటూనే తాను రీమేక్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై చర్చలు జరగడం లేదని చెప్పాడు. ఈ విపత్తు నుండి బయట పడ్డ తర్వాత ఈ రీమేక్ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రీమేక్ మేకర్స్ కార్తిక్ ఆర్యన్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.