అందరూ కొత్తవాళ్లే కలిసి చేసిన ‘ఆర్ఎక్స్ 100’ అనే చిన్న సినిమా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మంచి బజ్ రావడంతో చిత్ర బృందం ఫుల్ జోష్ మీద ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ఫలితం మీద వాళ్ల కాన్ఫిడెన్స్.. స్టేట్మెంట్లు చూస్తే షాకవ్వాల్సిందే. రెండో ట్రైలర్ లాంచ్ అయిన సందర్భంగా ఈ చిత్ర కథానాయకుడు కార్తికేయ.. దర్శకుడు అజయ్ భూపతి భారీ స్టేట్ మెంట్లే ఇచ్చేశారు.
రొటీన్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లు.. అలాంటి సినిమాలే చూస్తాం అనే వాళ్లు ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాకు రావాల్సిన అవసరం లేదని దర్శకుడు అజయ్ భూపతి స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. తాను కొత్త తరహా సినిమల్ని ఇష్టపడతానని.. రివ్యూలు చదివినపుడు అక్కడా ఇక్కడా జనాలు మాట్లాడుతున్నపుడు కొత్త తరహా సినిమాలు రావట్లేదనడం చూశానని.. ఆ ఆలోచనతోనే ఒక కొత్త కథతో సినిమా చేశానని అతను చెప్పాడు. ఈ సినిమా ఆడుతుందో లేదో కానీ.. కొత్తగా మాత్రం ట్రై చేశానని.. సినిమా ఆడకపోతే తన ఊరికి వెళ్లి గేదెలు కాసుకుంటానని అజయ్ చెప్పడం విశేషం.
ఇక హీరో కార్తికేయ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం వచ్చే సినిమాల తరహాది ‘ఆర్ ఎక్స్ 100’ కాదని అన్నాడు. 50 ఏళ్లకోసారి ఇలాంటి సినిమాలు వస్తుంటాయంటూ అతను చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు. ఈ సినిమాకు బజ్ తెచ్చినందుకు అందరికీ తాము కొన్ని రోజులుగా థ్యాంక్స్ చెబుతూ వస్తున్నామని.. కానీ సినిమా చూశాక ప్రేక్షకులందరూ తమకు మంచి సినిమా ఇచ్చినందుకు రివర్సులో థ్యాంక్స్ చెబుతారని అతనన్నాడు. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు గర్వపడేలా చేస్తామని కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మరి నిజంగా వీళ్లు చెబుతున్నంత గొప్పగా ‘ఆర్ ఎక్స్ 100’ ఉంటుందా?