బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2013లో అనురాగ్ కశ్యప్ రూమ్ కి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (ఐ), 354, 341, 342 కింద అనురాగ్ పై కేసు నమోదు చేశారు. దర్శకుడుకి సమన్లు జారీ చేసిన పోలీసులు.. గురువారం దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. తనపై పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అవాస్తవాలని కశ్యప్ పేర్కొన్నాడు. 2013లో నటి వేధింపులు జరిగాయని ఆరోపించిన సమయంలో తాను అసలు ఇండియాలో లేనని అనురాగ్ కశ్యప్ ఆధారాలుగా చూపించారని ఆయన తరఫు న్యాయవాది ప్రియాంక ఖిమాని తెలిపారు.
న్యాయవాది ప్రియాంకా ఖిమాని దీనిపై స్పందిస్తూ.. ''నటి ఆరోపణల్ని అనురాగ్ పూర్తిగా ఖండించారు. తన స్టేట్మెంట్ పోలీసులకు అందించారు. 2013 ఆగస్టులో అనురాగ్ తన సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాల్ని పోలీసులకు అందించారు. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. నటి వ్యాఖ్యలు అవాస్తవాలని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలు నా క్లయింట్ ని.. ఆయన కుటుంబ సభ్యుల్ని అభిమానుల్ని బాధించాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కూడా తనకు జరిగిన నష్టానికి చట్టపరంగా వెళ్లాలని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు.. వ్యక్తిగత ఉద్దేశాల కోసం మీటూ ఉద్యమాన్ని వాడుకున్నందుకు నటిపై చర్యలు తీసుకోవాలని కోరారు'' అని పేర్కొన్నారు.