ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా ఆలస్యం అయిన బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు గత నెలలో ప్రారంభం అయ్యింది. ఇక ఈ వారంలో తమిళ మరియు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో అన్ని భాషల బిగ్ బాస్ ల గురించి ట్రెండ్ నడుస్తూనే ఉంది. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ వారి వారి అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉన్నారు. తమిళ బిగ్ బాస్ 3వ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ మాజీ హీరోయిన్ కస్తూరి బిగ్ బాస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను బిగ్ బాస్ టీం మరియు ఆ షో ప్రారంభం అయ్యే విజయ్ టీవీలు మోసం చేశాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే సమయంలో పేమెంట్ విషయం మాట్లాడుకున్నాం. ఆ సమయంలో మాట్లాడుకున్న అమౌంట్ ను ఇప్పటి వరకు షో నిర్వాహకులు కాని ఛానెల్ వారు కాని ఇవ్వలేదు అంటూ కస్తూరి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ డబ్బుతో అనాధ పిల్లలకు సాయం చేయాలని ముందే భావించాను. కాని వారు ఏడాది దాటి పోయినా కూడా ఇప్పటి వరకు అమౌంట్ సెటిల్ చేయలేదు. ఈ విషయాన్ని కమల్ హాసన్ వద్దకు తీసుకు వెళ్ల వచ్చు కదా అంటూ ఆమెకు నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.
గత సీజన్ లో వైల్డ్ ఎంట్రీ ఇచ్చి ఉన్న కొన్ని రోజులు హడావుడి చేసిన ఈమె షో కు మంచి రేటింగ్ తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. అలాంటి కస్తూరికి నిర్వాహకులు పారితోషికం మొత్తం చెల్లించకుండా మొండి చేయి చూపించడం విచారకరం అంటూ నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఇలా పారితోషికాలు ఇవ్వకుండా ఉండే మోసాలు కూడా జరుగుతాయా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.