పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీని ఫినిష్ చేసేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి పవన్ వర్క్ అంతా పూర్తయిపోనుంది. పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యంత వేగంగా చేసిన సినిమా ఇదేనేమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. కాటమరాయుడు కోసం పవన్ కి గిట్టిన పారితోషికం లెక్కలు వింటే ఆశ్చర్యం వేయక మానదు.
రెమ్యూనరేషన్ లో టాలీవుడ్ లెక్కలన్నీ సరిచేసేశాడట పవన్. కాటమరాయుడు కోసం నిర్మాతల నుంచి పైసా కూడా పారితోషికం తీసుకోని పవన్.. నైజాం- ఓవర్సీస్ హక్కులు మాత్రం రాయించుకున్నాడట. నైజాం రైట్స్ విక్రయం రూపంలో 25 కోట్ల రూపాయలు గిట్టాయనే టాక్ ఉంది. ఇక ఓవర్సీస్ హక్కులను రూ. 8.5 కోట్లకు విక్రయించారట. అంటే.. ఈ రెండు ఏరియాల ద్వారా పవన్ కళ్యాణ్ కు లభించిన మొత్తం అక్షరాలా ముప్ఫై మూడు కోట్ల రూపాయల పైమాటే.
ఒక సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అంటే చిన్న విషయమేమీ కాదు. టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇప్పటివరకూ ఇంత మొత్తం అందుకోలేదు. ఈ విషయంలో కూడా పవన్ చూపిస్తున్న పవర్ చూసి ట్రేడ్ జనాలకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/