అద్దంలో ఒంపుసొంపులు చూసుకున్నావా?

Update: 2015-07-28 20:08 GMT
నిన్ను నువ్వు ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? అని ప్రశ్నిస్తాం ఎవరైనా కాస్త అంద వికారంగా కనిపిస్తే. ఈ డైలాగ్‌ ని సినిమాల్లో చాలాసార్లు ఉపయోగించేశారు కూడా. అయితే ఇదే డైలాగ్‌ ని ఓ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నిజజీవితంలో తనపై తానే ప్రయోగించుకుంది. అసలు నేను అందంగా ఉన్నానా? నాలో ఒంపుసొంపులు పుష్కలంగా ఉన్నాయా? లేదా? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని అని చెప్పింది. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి ఇలా ప్రశ్నించుకునేదానినని అంటోంది కేట్‌ విన్‌స్లెట్‌.

అసలు టైటానిక్‌ సినిమా కాసుల కుంభవృష్టి కురిపించడానికి ఈ అందగత్తెలోని రూపలావణ్యమే ఓ కారణం కదా! అని మనకి అనిపించవచ్చు. కానీ ప్రతి ఆడదానికి ఉండే సందేహమే తనకి కూడా యుక్త వయసులో ఉండేదని చెప్పింది. అందుకే ఇప్పట్నుంచే తన కూతురు మియా (14)కి అందం, ఒంపుసొంపుల విషయంలో కాసింత అవగాహన కలిగించి తర్ఫీదునిస్తోందిట. అంతేకాదు దేవుడి దయ వలన నేను, నా కూతురు అందమైన దేహశిరులతో అలరారుతున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది.. అని చెబుతోంది కేట్‌. వయసులో ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే మనల్ని మనం సరిచేసుకోవాలనే తపనలో పడతామని చెప్పింది క్యాట్‌. అసలు ఈ అమ్మడికి ఇలాంటి సందేహాలెందుకు వస్తున్నాయో కానీ, డికా ప్రియో అంతటివాడే ఆ ఒంపుసొంపుల్ని నగ్నంగా కాన్వాసుపై చిత్రీకరించాడంటే ఆ మాత్రం ఉండబట్టే కదా!
Tags:    

Similar News