సినిమా ఇండస్ట్రీలో నటీమణులకు లైంగిక వేధింపులు ఎక్కవన్న విషయం బహిరంగ రహస్యం. తమను ఎవరు ఎంతలా వేధిస్తారన్న విషయాన్ని చెప్పేందుకు నటీమణులు పెద్దగా ఇష్టపడరు. రెబల్ ముద్రను వేసి.. అవకాశాల్లేకుండా చేస్తారన్న భయం చాలామందిలో కనిపిస్తుంది. అయితే.. ఈ మధ్య కాలంలో తమకు జరిగిన.. జరుగుతున్న అన్యాయం గురించి..లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిజానికిది స్వాగతించాల్సిన ట్రెండ్ గా చెప్పాలి.
గడిచిన కొన్ని నెలలుగా హాలీవుడ్ లో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ కావటమే కాదు.. కొందరు సినీ ప్రముఖులు కామ పిశాచులన్న విషయాన్ని చెప్పేశారు. అలాంటి వారిలో నిర్మాత హార్వీ ఒకరు. అతగాడి దుర్మార్గాల గురించి.. వేధింపుల గురించి ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఓపెన్ అయ్యారు.
ఇప్పుడా జాబితాలోకి చేరారు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్. 2009లో ది రీడర్ మూవీకి ఆమె ఉత్తమ నటిగా అస్కార్కు ఎంపికయ్యారు. దాన్ని అందుకునే సమయంలో ఆ సినిమాకు ఫైనాన్స్ చేసిన హార్వీ గురించి మాట్లాడమని ఒత్తిడి తెచ్చారు. కానీ.. తన స్పీచ్ లో హార్వీ గురించి కేట్ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.
అప్పుడెప్పుడో జరిగిపోయిన ముచ్చటను ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్లు? అంటే.. కారణం లేకపోలేదు. ఎందుకంటే నాడు అలా ఎందుకు జరిగిందో తాజాగా బయటపెట్టింది. తాను నటించిన మొదటి చిత్రం హెవెన్లీ క్రియేచర్స్ మూవీకి హార్వే నిర్మాత. ఆ సినిమా నుంచి తనను ఎప్పుడు కలిసినా తానే మొదటి ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకునేవాడని.. అతడు నాకు ఆఫర్ ఇవ్వటం ఏమిటి? ఆ సినిమాకు మూడుసార్లు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యానని చెప్పింది.
అంతేకాదు.. హార్వీ తనను కలిసిన ప్రతిసారీ రూడ్ గా మాట్లాడేవాడని.. తనతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సీన్ అతనికి లేదని తేల్చింది. అందుకే.. తాను అస్కార్ అవార్డు ఫంక్షన్లో కావాలనే తన పేరును ప్రస్తావించలేదంటూ ఓపెన్ అయ్యింది. తాను అవార్డు తీసుకునే సమయంలో హార్వీ పేరును ప్రస్తావించాల్సినంత సీన్ వాడికి లేదన్న మాటను చెప్పకనే చెప్పేసింది.