రాధేశ్యామ్‌.. ఆర్‌ఆర్ఆర్ మద్య వచ్చే ఆ రెండు సినిమాలు నిలిచేనా?

Update: 2022-03-04 04:46 GMT
అన్నీ తెలిసి కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా పులి నోట్లో తల పెట్టినట్లుగా రాధేశ్యామ్‌ మరియు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల మద్య విడుదల అయితే ఏం జరుగుతుందో కూడా తెలిసి విడుదల చేయడం అవివేకం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండ్ అప్‌ రాహుల్ మరియు త్రిగుణ యొక్క కథ కంచికి మనం ఇంటికి సినిమాలు మార్చి 18వ తారీకున రాబోతున్నాయి.

ఆ తేదీ ఎంత డేంజర్‌ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఎందుకంటే మార్చి 11వ తారీకున 'రాధేశ్యామ్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా రెండు వారాల పాటు ప్రభాస్ జోరు కంటిన్యూ చేస్తాడు అనడంలో సందేహం లేదు. ఇక మార్చి 25వ తారీకున టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల మద్య వారం మార్చి 18. ఆ సమయంలో ఆ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

రాధేశ్యామ్‌ ను చూసిన ప్రేక్షకులు మళ్లీ ఆర్ ఆర్‌ ఆర్‌ కోసం వెయిట్‌ చేస్తారు. అంతే తప్ప చిన్న సినిమా లను చూడాలని భావించరు. ఒక వేళ స్టాండ్‌ అప్‌ రాహుల్ మరియు కథ కంచికి మనం ఇంటికి సినిమాలు మంచి టాక్ ను దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా వసూళ్లు మాత్రం నిరాశ పర్చే అవకాశం ఉంటుంది. అంత భారీ సినిమాల నడుమ ఈ రెండు సినిమాలు జనాలకు అస్సలు కనిపించవు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఈమద్య కాలంలో చిన్న సినిమాలు కూడా సరైన సమయంలో సేఫ్‌ జోన్ లో విడుదల చేస్తే మంచి వసూళ్లను దక్కించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాస్త పాజిటివ్‌ టాక్ వస్తే జనాలు కలెక్షన్స్ కురిపిస్తున్నారు. కాని రాధేశ్యామ్‌ మరియు ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రాలతో పోటీ అన్నట్లుగా విడుదల అయితే మాత్రం ఖచ్చితంగా ఫలితం తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక తస్మాత్‌ జాగ్రత్త అంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

రాజ్ తరుణ్‌ నటించిన స్టాండ్‌ అప్‌ రాహుల్‌ కి మంచి బజ్ ఉంది. ఒక మంచి ఎంటర్‌ టైనర్ గా సినిమా ఉంటుందేమో అని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భావించారు. కాని ఇప్పుడు సేఫ్‌ జోన్ లో కాకుండా ఇలా డేంజర్‌ జోన్‌ లో రావడం వల్ల సినిమా టాక్‌ తో సంబంధం లేకుండా కమర్షియల్‌ గా ప్లాప్ అవుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విడుదల విషయం లో ఆ రెండు సినిమాలు కాస్త జాగ్రత్త పడితే బెటర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News