ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు కొద్ది రోజులుగా వెర్బల్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కాకినాడ పర్యటనను పవన్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో పవన్ వైజాగ్ పర్యటన సాగుతోందని కత్తి మహేశ్ విమర్శించిన విషయం విదితమే. `నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!` అంటూ పవన్ పై కత్తి మహేశ్ సెటైర్ వేశారు. తాజాగా విడుదలైన `అజ్ఞాతవాసి` టీజర్ పై కూడా కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సారి పవన్ తో పాటు ఆయన సన్నిహితుడు, ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కామెంట్లు చేశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ పై సెటైరికల్ గా....`అజ్ఞానవాసి` అంటూ ఓ వీడియోను మహేశ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
`అజ్ఞాతవాసి`టీజర్ పై వ్యంగ్యాత్మకంగా ‘అజ్ఞానవాసి’ పేరుతో కత్తి మహేశ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?’ అంటూ పవన్ పై మహేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా త్రివిక్రమ్ పై కూడా విమర్శలు గుప్పించారు. ‘అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.`అజ్ఞాతవాసి` టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ చేశారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అంటూ మరో పోస్ట్ చేశారు.