అసలే అందగత్తె .. ఆపై అదృష్టవంతురాలు .. అడిగినంత పారితోషికం .. విలాసవంతమైన జీవితం .. విపరీతమైన క్రేజ్. ఇంతకు మించి ఎవరైనా కోరుకునేదేవుంటుంది? ఎంతోమంది అసూయపడే లగ్జరీ లైఫ్ కత్రినా సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ఆమెను ఒక దేవతగానే ఆరాధిస్తూ ఉంటారు. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం .. అక్కడ బ్రేకప్ లు సర్వ సాధారరణం. అలాంటి బ్రేకప్ లు కత్రినా లైప్ లో లేకపోలేదు. ఇక ఈ సారి విక్కీ కౌశల్ తో ఆమె ప్రేమ మాత్రం పెళ్లిపీటల వరకూ వెళ్లింది.
కొంతకాలంగా కత్రినా - విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్నారు. వివాహబంధంతో ఒకటి కావాలనే నిర్ణయానికి రాగానే అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టేశారు. రాజస్థాన్ లోని ఒక ఖరీదైన హోటల్లో రేవు వీరి పెళ్లి జరగనుంది. కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పెళ్లికి దగ్గర బంధువులకు .. అత్యంత ఆప్తులకు మాత్రమే ఆహ్వానం ఉంది. కరోనా కారణంగా .. ఇతర భద్రత కారణాల వలన అనేక నిబంధనలు విధించడం గురించే అంతటా చెప్పుకుంటున్నారు.
ఇక ఈ పెళ్లికి సంబంధించి కత్రినా ఉపయోగించే వస్తువులు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ప్రచారాన్ని పొందుతున్నాయి. ఆ వస్తువుల ఖరీదు గురించే అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో పెళ్లి మెనూ కూడా చేరిపోయింది. ఇండియన్ - వెస్ట్రన్ మిక్స్ మెనూను కత్రినా - విక్కీ కలిసి ఎంపిక చేశారట. లైవ్ కచోరి .. చాట్ సాల్ట్ .. కబాబ్ తో పాటు, దహి భల్లా .. ఫ్యూజన్ చాట్ తో పాటు వివిధ రకాల పదార్థాలు ఈ విందులో ఉండనున్నట్టుగా చెబుతున్నారు.
రాజస్థాన్ సంప్రదాయ వంటకమైన దాల్ బాటి కూడా ప్రత్యేకమైన వంటల జాబితాలో ఉందని అంటున్నారు. 15 రకాల పప్పులతో ఈ వంటకం చేస్తారట. పెళ్లికి అవసరమైన కాయగూరలను థాయ్ ల్యాండ్ నుంచి తెప్పిస్తున్నారు. అలాగే మరికొన్ని ఐటమ్స్ ఉత్తర భారత దేశం నుంచి రప్పిస్తున్నారు. ఇక సంగీత్ లో కత్రినా తన సినిమాల్లోని హిట్ సాంగ్స్ కు డాన్స్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఆ పాటల్లో రణబీర్ కపూర్ కాంబినేషన్ హిట్స్ లేకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే ఈ ఏడాది అంతా కూడా కత్రినా పెళ్లి గురించే మాట్లాడుకునేంత స్థాయిలో ఈ పెళ్లి జరుగుతోంది మరి.