క‌రోనా సోకి గ్లామ‌ర్ కోల్పోయిన స్టార్ హీరోయిన్

Update: 2021-06-14 11:30 GMT
ఇటీవ‌ల సెకండ్ వేవ్ లో బాలీవుడ్ టాలీవుడ్ స‌హా అన్నిచోట్లా సెల‌బ్రిటీల‌కు కోవిడ్ సోకి తీవ్ర ఇబ్బందుల‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన‌.. త‌న స్నేహితుడు విక్కీ కౌశ‌ల్ కి కోవిడ్ సోక‌డంతో స్వీయ‌నిర్భంధంలో చికిత్స పొందారు. కేవ‌లం 20రోజుల్లోపే పూర్తిగా కోలుకున్నారు.

కోవిడ్ 19 కార‌ణంగా క‌త్రిన గ్లామ‌ర్ కూడా త‌గ్గింది. అయితే క‌త్రిన మ‌ళ్లీ జిమ్ కెళ్లి ఫిట్ అండ్ హాట్ గా త‌యారవ్వ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌హ‌మ్మారీ వ‌ల్ల క‌త్రిన‌ బాగా వీక‌య్యారు. ఆకృతి పాడైంది. అందుకే వెంట‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఏప్రిల్ లో వైరస్ నుంచి కోలుకున్న క‌త్రిన‌ తన పాత ఫిట్ నెస్ దినచర్యకు ఎలా తిరిగి వ‌స్తోందో తాజాగా వెల్ల‌డించారు. ఫిట్నెస్ నియ‌మావ‌ళి పాటించినా కానీ ఎవరైనా వైరస్ బారిన పడినప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. వారి శరీరం చాలా మార్పులకు లోన‌వుతుంది. అలసట నీర‌సం ప్రధాన లక్షణాలు. సాధారణ పనులు కూడా కఠినమైనవిగా అనిపిస్తాయని క‌త్రిన వెల్ల‌డించారు.

నిజానికి కోలుకున్నా కానీ వ్యాయామానికి వెళ్లేందుకు ఓపికపట్టాల్సి వ‌చ్చింద‌ని క‌త్రిన‌ వెల్లడించింది. జిమ్ లో నెమ్మదిగా మొద‌లై శరీరం విన‌డానికి అల‌వాటు ప‌డ్డాకే జిమ్ చేయాల‌ని తెలిపారు. అక్షయ్ కుమార్ -క‌త్రిన నటించిన `సూర్యవంశీ` విడుదల కావాల్సి ఉంది. త‌దుప‌రి క‌త్రిన టైగ‌ర్ 3లో న‌టిస్తోంది. అలాగే టైగ‌ర్ ద‌ర్శ‌కుడు జాఫ‌ర్ తెర‌కెక్కించే మ‌రో చిత్రంలో సూప‌ర్ గాళ్ త‌ర‌హా పాత్ర‌లోనూ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News