బాలీవుడ్ కుర్ర జంటల్లో హాట్ పెయిర్ ఎవరంటే రణ్ బీర్ కపూర్ - కత్రినా కైఫ్ అనే చెప్పాలి. వీళ్లిద్దరూ తమ రిలేషన్ ని యాక్సెప్ట్ చేయకపోయినా.. అనౌన్స్ మాత్రం చేయలేదు. ఇంతకముందు ఫారిన్ టూర్లలో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఇప్పుడు ఇండియాలోనే మొదలుపెట్టేశారు.
ఓసారి తాము డేటింగ్ చేయడం లేదని అనౌన్స్ చేయడం, తర్వాత బ్రేకప్ అయిపోయారంటగా నవ్వేయడం లాంటివి చేస్తూ.. కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు రణ్ బీర్ - కత్రినా. ఇప్పుడీ ప్రేమపక్షుల సయ్యాట ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఓ ఇన్సిడెంట్ సాక్ష్యంగా నిలిచింది. వీళ్లిద్దరి బంధం ఇంకా ధృడంగా మారిందని నిరూపిస్తోంది. రణ్ బీర్ కపూర్ తాత వరుసయ్యే శశికపూర్ క్రిస్మస్ లంచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం కపూర్ వంశమంతా హాజరయింది. కొన్నేళ్లుగా ఈ కార్యక్రమానికి కపూర్ వారసులు, వంశస్తులు హాజరవడం ఆనవాయితీ.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రోగ్రాంకి.. కత్రినాని వెంటబెట్టుకుని వచ్చాడు రణ్ బీర్ కపూర్. నిజానికి గతేడాదే ఈ క్రిస్మస్ లంచ్ కి కేట్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆమె లండన్ లో తన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటోంది. దీంతో రణ్ బీర్ కపూర్ కుటుంబంతో మమేకం అయ్యే ఛాన్స్ అప్పుడు రాలేదు. ఇప్పుడు మాత్రం అవకాశం మిస్ చేసుకోలేదు కేట్. ఫ్యామిలీ ఈవెంట్స్ కి కూడా కలిసి వచ్చేస్తున్నారంటే.. ఇక పబ్లిక్ కి తమ అనుబంధం చెప్పడం ఒకటే లేట్. రణ్ బీర్ - కత్రినాల పెళ్లి వార్త త్వరలో వినచ్చనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది.