ఆ క్రికెటర్ గురించి చెప్పిన కత్రినా

Update: 2017-04-29 07:32 GMT
క్రికెట్ ను సినిమాను భారత దేశ ప్రజలు నుండి వేరు చేయడం సాధ్యం కాదు. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇటువంటిదే మరోటి ఉంది. అదే  క్రికెటర్‌లకు  బాలీవుడ్ తారలుకు మధ్య బంధం. ఇది ఇప్పటి నుండి కాదులెండి షర్మిలా టాగోర్ – మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి ప్రేమ నుండి కొనసాగుతుంది. అందరి లాగానే కత్రినా కైఫ్ కూడా ఒక అభిమాన క్రికెటర్‌ ఉన్నాడు అతను మరో ఎవ్వరో కాదు భారత దేశమంతాముద్దుగా ‘ది వాల్’ అని పిలుస్తుంది. అయితే వీరి మధ్యన ఏదో ఉందనే టాక్ వస్తుండటంతో.. ఇప్పుడు కత్రినా స్పందించింది.

అవును నాకు ద్రావిడ్ అంటే నాకు చాలా ఇష్టం.. అతను చాలా కూల్ గా ఉంటాడు.. ఎప్పుడూ ఓవర్ రియాక్ట్ కాడు. పక్కా జెంటిల్ మాన్ ఆయన అంటోంది మన బంగారం. ''ఐ‌పి‌ఎల్ మొదటి సీజన్ లో ద్రావిడ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్ గా ఉండేవాడు. అప్పుడు నేను ఆ టీమ్ కి ప్రచారకర్తగా ఉన్న. కానీ అతని తో ఎప్పుడూ మాటలాడే సమయం రాలేదు. ఒకే సారి మూడు మాటలు మాట్లాడాను అంతే. అతను కూడా చాలా మితబాషి'' అని తన అభిమాన క్రికెటర్ గురించి చెప్పింది కత్రినా కైఫ్.

అయితే తమ రిలేషన్ అంతవరకే నని.. అంతేకాని ఇంకేం లేదని కూడా చెప్పేసింది కత్రినా. నిజానికి ఈమె పదే పదే డ్రావిడ్ అని చెప్పడం వలనే ఏవో కొన్ని రూమర్లు వచ్చుంటాయి కాని.. అసలు వీరు రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అయ్యారని ఎవ్వరూ అనుకోవట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News