బులుగు నిక్క‌రులో మ‌ల్లీశ్వ‌రి అందాలు‌

Update: 2021-03-18 16:30 GMT
ఇండియా లెవ‌ల్లో స్టార్ డ‌మ్ అంటే ఏంటో చూపించిన‌ క‌త్రిన కైఫ్ సూపర్ హీరో చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకి `సూపర్ సోల్జర్` అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. ఇండియాలో తొలి సూపర్ హీరో(ఉమెన్) చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ సాగుతోంది. అబుదబి- దుబాయ్- పోలాండ్- జార్జియా- ఉత్తరాఖండ్ లలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది.

మ‌రోవైపు క‌త్రిన యువ‌హీరోల స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. న‌వ‌త‌రం స్టార్ల‌తో `ఫోన్ భూత్` అనే థ్రిల్ల‌ర్ మూవీలో న‌టిస్తూనే.. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న‌ టైగర్ 3 లోనూ న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా క్వీన్ గానూ క‌త్రిన స‌త్తా చాటుతున్నారు. ఇన్ స్టా వేదిక‌గా రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్న ఈ బ్యూటీ తాజాగా పొట్టి నిక్క‌రుతో హీట్ పెంచింది. బ్లూ టాప్ .. కాంబినేష‌న్ నేవీ బ్లూ డెనిమ్ నిక్క‌రులో ప్ర‌త్య‌క్ష‌మైంది క్యాట్. ``న్యూ డే .. న్యూ హెయిర్ క‌ట్.. న్యూ ఫిలిం`` అంటూ ప‌రిచ‌యం చేసింది. ఇంత‌కీ ఇది ఏ సినిమా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అక్షయ్ కుమార్ స‌ర‌స‌న క‌త్రిన‌ న‌టించిన సూర్య‌వంశీ రిలీజ్ కి రానుంది.
Tags:    

Similar News