మాజీలిద్ద‌రూ ఎదురుప‌డ్డారు.. జ‌స్ట్ అంతే

Update: 2016-01-09 15:16 GMT
స‌ల్మాన్‌- క‌త్రిన య‌వ్వారం ఎనీ టైమ్ హాట్ టాపిక్‌! వీళ్లిద్ద‌రూ కొట్టేసుకున్నారు, విడిపోయారు.. అంటూ ప్ర‌చారం సాగించింది ఉత్త‌రాది మీడియా. క‌ట్ చేస్తే ఆ ఇద్ద‌రూ ఎప్ప‌టికీ కొట్టుకోరు. అంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మే అని తేలిపోయింది. ఎవ‌రి దారిలో వారు వెళుతున్నారంతే అని అంద‌రికీ ప‌లు సంద‌ర్భాల్లో అర్థ‌మైంది. అర్థ‌మ‌య్యేలా ప్ర‌వ‌ర్తించారు ఇద్ద‌రూ. ప్రేమించుకున్నాం, విడిపోయాం. అంతమాత్రానికే మేం కొట్టుకుంటున్నాం అని పుకార్లు పుట్టించ‌డం ఏం బావుంది? అని త‌మ చేత‌ల ద్వారా ఎదుటివారిని ప్ర‌శ్నించారు. ఇప్పుడు మ‌రోసారి దానికి కొన‌సాగింపు చ‌ర్య‌తో మీడియాకి చిక్కారు.

ఈసారి సీన్ య‌శ్‌ రాజ్ ఫిలింస్ స్టూడియోలో . అక్క‌డ ఈ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు ఎదురు ప‌డ్డారు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఏదో క‌లిశాంలే, మాట్లాడుకున్నాం లే అన్న‌ట్టు కాకుండా కాస్తంత మ‌ద‌నం ఆ ఇద్ద‌రిమ‌ధ్యా క‌నిపించింది. మేం ప్రేమికులం కాదు, కేవ‌లం స్నేహితులం మాత్ర‌మే అనిపించే సీన్ అక్క‌డ ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల‌కు క‌నిపించింది. దానికి తోడు క‌త్రిన ఇచ్చిన వాంగ్మూలం ప‌క్కా క్లారిటీతో ఉంది.

అవును మేం క‌లుసుకున్నాం. స్నేహ‌పూర్వ‌కంగా మాత్ర‌మే క‌లుసుకున్నాం. ఎదురుప‌డినప్పుడు నేనే వెళ్లి త‌న‌ని ప‌ల‌క‌రించా.. అని చెప్పింది క్యాట్. ఫితూర్ ప్ర‌మోష‌న్ కోసం వైఆర్ ఎఫ్ స్టూడియోకి వెళ్లిన‌ క‌త్రిన షూటింగులో పాల్గొంటున్న స‌ల్మాన్‌ కి తార‌స‌ప‌డింది.. అంతే అక్క‌డ‌ విరామ సమ‌యంలో ఆ ఇద్ద‌రిమ‌ధ్యా మాటా మంతీ సాగాయి. అంత‌కుమించి ఏం లేదు. క్యాట్ ర‌ణ‌బీర్‌ నే ప్రేమిస్తోంది. స‌ల్మాన్ లులియానే ప్రేమిస్తున్నాడు. ఇందులో నో డౌట్.
Tags:    

Similar News