ప్రియుడి బెస్టు ఫ్రెండ్ తో వాటే రొమాన్స్

Update: 2016-01-13 09:30 GMT
బాలీవుడ్ లో రిలేషన్స్ మాత్రమే కాదు.. వాటిని ఎక్స్ ప్రెస్ చేసే విధానం కూడా భలేగా ఉంటుంది. అలాగే ఆ రిలేషన్ ఉంటుందో, ఊడుతుందో చివరివరకూ చెప్పలేం కానీ.. ఏదన్నా రిటార్ట్ ఇవ్వడంలో కూడా క్రియేటివిటీ చూపించేస్తారు బాలీవుడ్ స్టార్స్.

ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫితూర్ మూవీ చేస్తోంది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఆదిత్య రాయ్ కపూర్ తో ఈ సినిమాలో కలిసి నటిస్తోంది కేట్. ఈ మూవీలో ఆదిత్య - కత్రినల మధ్య రొమాంటిక్ సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయని బాలీవుడ్ కోడై కూస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పుడో  పోస్టర్ రిలీజ్ చేశారు. కేట్ ని అలా గాల్లోకి ఎత్తేసి, ఆదిత్య రాయ్ కపూర్ దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఉంది ఆ ఫోటో. ఇందుకు కేట్ కూడా బాగానే సహకరిస్తోంది. లిప్ లాక్ కి ఓ సెకన్ ముందు క్లిక్ మనిపించినట్లుగా ఉన్న పోస్టర్ బాగా అట్రాక్టివ్ గా ఉంది. కేట్ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం.. రణ్ బీర్ కి రిటార్ట్ ఇచ్చేందుకేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

కత్రినా లేటెస్ట్ లవర్ రణ్ బీర్ కపూర్.. తన మాజీ లవర్ దీపికా పదుకొనేతో కలిసి ఈ మధ్య తమాషా మూవీ చేశాడు. ఇద్దరు కలిసి లిప్ లాక్ లను కూడా బాగానే లాగించారు. ఆ తర్వాత ప్రమోషన్స్ లో కూడా ముద్దులు పెట్టేసుకుని హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ఒళ్లు మండిన కత్రినా కైఫ్.. ఇలా ఆన్ స్క్రీన్ పై ఆదిత్యతో కొంచెం ఓవర్ చేస్తోందని అంటున్నారు. అఫ్ కోర్స్.. దీనిపై ఏమన్నా అడిగామంటే మాత్రం.. యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు అంటూ మనకే క్లాసులు పీకుతారు లెండి. ఎందుకొచ్చిన గొడవ.. యాక్షన్,రియాక్షన్ చూసి ఎంజాయ్ చేయడమే.

Tags:    

Similar News