కత్రిన విషయంలో రణబీర్ టూమచ్?

Update: 2016-04-16 13:30 GMT
బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్ - కత్రినా కైఫ్ లు బ్రేకప్ అయిపోయిన విషయం తెలిసిందే. కపూర్ ఫ్యామిలీతో కలిసి కైఫ్ డిన్నర్ కూడా చేసేశాక.. అందరూ ఇక బాజాబజంత్రీలే అనుకుంటున్న టైంలో సడెన్ గా వీళ్లిద్దరూ విడిపోయారు. తమ బ్రేకప్ సంగతిని బయటకు తెలిసేలా ప్రవర్తించడానికి సంకోచించలేదు.

అయితే.. ఇప్పుడీ విషయంలో కత్రినా కైఫ్ కాంప్రమైజ్ కు ట్రై చేస్తోందని అంటున్నారు. రణ్ బీర్ తో ఉన్న విబేధాలకు చెక్ పెట్టేందుకు ట్రై చేస్తోందట. తాజాగా ఆర్తి షెట్టీ బర్త్ డే బాష్ లో తన మాజీ లవర్ తో మాట్లాడేందుకు కత్రినా తెగ ట్రై చేసింది. అయితే రణ్ బీర్ మాత్రం కేట్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత బెబో ఇచ్చిన పార్టీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. చివరకు రణ్ బీర్ కార్ పక్కన తన కార్ ను ఆఫి మాట్లాడేందుకు చాలానే ట్రై చేసిందట కేట్. అయితే.. ఈ హీరో మాత్రం ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. జరిగినదాని గురించి ఇక మాట్లాడ్డానికి ఏం లేదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడంటున్నారు.

కనీసం ఓసారి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా రణ్ బీర్ రియాక్ట్ కావడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. ఆమె వెర్షన్ ఓసారి విని ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి కానీ.. కనీసం వినడానికి కూడా ఇష్టపడకుండా వేధించడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News