ట్రెండీ టాక్: అత‌డికి 33.. ఆమెకు 38.. అయితే ఏంటి?

Update: 2021-05-17 04:30 GMT
అవును.. అత‌డికి 33.. ఆమెకు 38.. అయితే ఏంటి? ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డితే త‌ప్పేంటి? వ‌యోభేధం ఉంటే క‌లిసి న‌టించ‌కూడ‌దా? అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా ట్విట్ట‌ర్ ఇన్ స్టాలో టీజ్ చేయ‌కూడ‌దా? ఇవ‌న్నీ అభిమానుల ధ‌ర్మ సందేహాలు. మ‌రి వీటికి విక్కీ కౌశ‌ల్- క‌త్రిన జంట నుంచి సమాధానం వ‌స్తుందా? అంటే.. కాస్త వేచి చూడాలి.

అస‌లింత‌కీ క‌త్రిన‌తో విక్కీ కౌశ‌ల్ ఎఫైర్ మ్యాట‌ర్ లో నిజం ఎంత‌? ఆ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం గురించి వ‌రుస క‌థ‌నాలు వండి వార్చే బాలీవుడ్ మీడియాకి కూడా వంద‌శాతం క్లారిటీ లేదు. కానీ ప్ర‌తిసారీ ఈ జంట‌పై పుకార్లు కామ‌న్ గా మారాయి.

ఆదివారం నాడు ప్రియుడు విక్కీ కౌషల్ 33 వ పుట్టినరోజు గుర్తుగా కత్రినా కైఫ్ తాజాగా హార్ట్ ఫుల్ ఫోటోను పంచుకున్నారు. విక్కీ పుట్టినరోజున తమ మ‌ధ్య అనుబంధంపై పుకార్లు పుట్టించాలని కత్రినా కైఫ్ ఫోటో ఎంచుకున్న ఫోటో న‌వ్వించేయ‌డం ఖాయం. విక్కీ కౌషల్ ఆదివారం పుట్టినరోజు వేడుక‌లు జరుపుకున్నారు. సహ-నటుల నుండి లేదా సోషల్ మీడియా లో విషెస్ వెల్లువెత్త‌క‌పోయినా కానీ.. విక్కీ ప్రియురాలు కత్రినా కైఫ్ స్పెష‌ల్ డేని గుర్తుంచుకునేలా స్వీటెస్ట్ ఫోటోని షేర్ చేశారు.

విక్కీ తన కుటుంబం సమక్షంలో ఎలాంటి హ‌డావుడి లేకుండా సింపుల్ గా పుట్టినరోజు వేడుకలను జ‌రుపుకున్నాడు. కత్రిన విషయానికొస్తే.. విక్కీని విష్ చేస్తూ క‌త్రిన‌ షేర్ చేసిన‌ ఫోటో నిజంగా ప్ర‌త్యేక‌ ముద్ర వేసింది. సరిహద్దు వద్ద భారత సైన్యంతో ఉన్న విక్కీ త్రోబాక్ ఫోటో ఇది. అత‌డు జవాన్లతో టైమ్ పాస్ చేస్తూ సంతోషంగా నవ్వుతూ క‌నిపించారు. కత్రినా హ్యాపీ బర్త్ డే GIF ని ఉపయోగించి, ``హ్యాపీయెస్ట్ బర్త్ డే .. విక్కీకౌషల్.. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి`` అని వ్యాఖ్యానించారు.

విక్కీ తమ్ముడు సన్నీ కౌషల్ తన పుట్టినరోజు కేక్ తో అన్న‌య్య‌ ఫోటోను పంచుకున్నాడు. ఈ కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మంలో విక్కీ కౌశ‌ల్ తండ్రి  స్టంట్ డైరెక్టర్ షామ్ కౌషల్ కూడా ఉన్నారు. నీలాంటి కొడుకు పుట్టడం ఆశీర్వాదం అని విక్కీ తండ్రి గారు ఆశీర్వ‌చ‌నం అందించారు. విక్కీ-క‌త్రిన జంట‌గా న‌టిస్తున్నారు. అలాగే ఇత‌ర ప్రాజెక్టుల‌తోనూ ఆ ఇద్ద‌రూ బిజీగా ఉన్నారు. 2021 జూలై 16తో క‌త్రిన ఏజ్ 38.. ఆ రోజు విక్కీ రియాక్ష‌న్ ఎలా ఉండ‌నుందో చూడాలి.
Tags:    

Similar News