థ‌గ్స్ గుట్టు విప్పేసిన క్యాట్‌

Update: 2018-09-30 09:06 GMT
1795లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఆయుధ వ్యాపారం చేయ‌డానికి వ‌చ్చిన ఆంగ్లేయులు భార‌త‌దేశ వినాశ‌నానికి - దోపిడీకి కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదురించిన హిందూస్తాన్‌ బందిపోట్ల‌ క‌థ‌తో `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` తెర‌కెక్కింది. ఈ సినిమాలో థ‌గ్స్ పాత్ర‌ల్లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ - అమీర్ ఖాన్ న‌ట విన్యాసాలు ఒకెత్తు అనుకుంటే - మ‌రో కోణంలో క‌త్రిన‌ కైఫ్ సుర‌య పాత్ర అంత‌కుమించి అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సుర‌య పాత్ర ఎలా ఉంటుంది? అని కత్రిన‌నే అడిగేస్తే ఏం చెప్పిందో తెలుసా?

ఈ సినిమాలో యాక్ష‌న్ క్వీన్ త‌ర‌హా రోల్‌ కాదు. అంత‌కుమించి.. క‌థ‌ను న‌డిపించే ఎంతో ఇంపార్టెంట్ పాత్ర‌లో నటించాన‌ని క‌త్రిన తెలిపింది. సినిమా ఆద్యంతం కీల‌క స‌న్నివేశాల‌తో ముడిప‌డిన పాత్ర సుర‌య పాత్ర. టైగ‌ర్ జిందా హై త‌ర‌హాలో యాక్ష‌న్‌ - స్టంట్స్ చేయ‌ను అని చెప్పింది. టైగ‌ర్ జిందా హై చిత్రంలో క‌త్రిన .. క‌థానాయ‌కుడు స‌ల్మాన్ కి ధీటుగా ఫైట్స్ చేస్తుంది. కానీ ఆ పాత్ర‌కంటే విభిన్న‌మైన పాత్ర‌లో చేశాన‌ని క్యాట్ చెబుతోంది. అలానే `ధూమ్ 3` త‌ర్వాత విక్ట‌ర్ (విజ‌య్‌ కృష్ణ ఆచార్య‌)తో క‌లిసి రెండో సినిమాకి ప‌ని చేశాన‌ని - అత‌డు ఎంతో మేధోత‌నంతో సినిమాలు తీస్తార‌ని పొగిడేసింది. విక్ట‌ర్ విజ‌న్ - తెర‌పై విజువ‌ల్ బ్రిలియ‌న్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయ‌ని క‌త్రిన ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. క‌త్రిన చెప్పిన‌ట్టే థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ట్రైల‌ర్‌ లో క‌త్రిన ఒంపుసొంపుల వ‌య్యారాలు - ముఖాభిన‌యం - నాట్యం ఆక‌ట్టుకున్నాయి. ధూమ్ 3 - టైగ‌ర్ జిందా హై పాత్ర‌ల‌తో పోలిక క‌నిపించ‌లేదు. అందుకే `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` చిత్రంలో త‌న పాత్ర ఒక ఎరైవ‌ల్ లాంటిది అని చెబుతోంది.

ఇదే చిత్రంలో `దంగ‌ల్` పేం స‌నా షేక్ సైతం విల్లంబులు అందుకుని విరోచితంగా పోరాడే వీర‌నారి పాత్ర‌లో క‌నిపిస్తోంది. థ‌గ్స్ గ్యాంగ్‌ లో కీల‌క స‌భ్యురాలిగా క‌నిపిస్తోంది. ఇది క‌త్రిన పాత్ర‌తో పోలిస్తే డిఫ‌రెంట్‌. ఆ పాత్ర కోసం ఆర్చ‌రీ(విల్లు సంధించే విద్య‌)ను నేర్చుకున్నాన‌ని స‌నా షేక్ తెలిపింది. థ‌గ్స్ ట్రైల‌ర్‌లో స‌నా.. వీర‌త్వం స్ప‌ష్టంగా చూపించే ఆ ఒక్క షాట్ వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా చెబుతున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతోంది.
Tags:    

Similar News