విడిపోయాక వ్యాన్ కూడా ఎక్కనివ్వట్లేదు

Update: 2016-01-21 19:30 GMT
ఆ స్టార్ హీరో హీరోయిన్లు చాలా కాలం కలిసే ఉన్నారు. పబ్లిక్ ఈవెంట్లలో పబ్లిక్ గా తిరిగేశారు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్లకు మరొకరు హాజరయ్యేంత దగ్గరయ్యారు. విదేశాల్లో చక్కర్లు కొట్టారు. బీచుల్లో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. కానీ ఇదంతా గతం, ఇప్పుడిప్పుడే వాళ్లిద్దరూ విడిపోయారు. అందుకే ఇప్పుడు తన మాజీ ఫ్రెండ్ ని దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఆ హీరోయిన్.

ప్రస్తుతం ఈ మాజీ లవర్స్ ఇద్దరూ ఒక మూవీలో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్తగా స్టార్ట్ అయినదైతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. కొన్ని నెలల క్రితమే మొదలైంది. ఇప్పుడు మధ్యలో తప్పుకోవడం అసాధ్యం కావడంతోనే కంటిన్యూ చేస్తున్నారని టాక్. అయితే.. కొన్ని రోజుల క్రితమే విడిపోయిన ఈ జంట వ్యవహారం యూనిట్ కి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇప్పటివరకూ తన లవర్ తో కలిసి ఒకే వ్యానిటీ వ్యాన్ ని కలిసి పంచుకున్న హీరోయిన్.. ఇప్పుడు మాత్రం అతగాడిని వ్యాన్ లోకి రానివ్వనంటోంది. కెమేరా ముందు నుంచి పక్కకు వచ్చాక, కనీసం తన దగ్గరకి కూడా రానిచ్చే ప్రసక్తి లేదంటోంది.

ఒకటి రెండు రోజులకు అడ్జస్ట్ అవమని యూనిట్ బతిమిలాడినా ససేమిరా అనేసింది. దీంతో మరో వ్యానిటీ వ్యాన్ ని తెప్పించక తప్పలేదు. ఏమైనా బాలీవుడ్ లో ప్రొఫెషనలిజం బాగా ఎక్కువయిపోతోంది. కెమేరా ముందు ముద్దులాడేసుకుని - ఆఫ్ స్క్రీన్ లో మాత్రం గుద్దులాడుకుంటున్నారు హీరో హీరోయిన్లు. ఇంతకీ ఆ స్టార్ హీరో హీరోయిన్స్ ఎవరో మీకు అర్ధమైంది కదా.
Tags:    

Similar News