స్నీక్ పీక్: అడ్వెంచర్ హారర్ కామెడీగా వైభవ్ 'కట్టేరి'

Update: 2020-12-22 10:25 GMT
ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైభవ్.. తెలుగులో కంటే తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో 'గొడవ' 'కాస్కో' వంటి సినిమాలు చేసిన వైభవ్.. ఆ తర్వాత 'గోవా' 'సరోజ' 'గ్యాంబ్లర్' 'ఇరైవి' 'సిక్సర్' 'ఆర్ కె నగర్' వంటి పలు చిత్రాలతో కోలీవుడ్ లో పాగా వేసాడు. తాజాగా వైభవ్ 'కట్టేరి' అనే తమిళ అడ్వెంచర్ హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ - సోనమ్ బాజ్వా - ఆత్మిక ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా స్నీక్ పీక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'కట్టేరి' స్నీక్ పీక్ వీడియో ఓవైపు భయాన్ని కలిగిస్తూనే మరో వైపు నవ్వు పుట్టిస్తోంది. హారర్ అంశాలతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ ఎస్.ఎన్ అందించిన నేపథ్యం సంగీతం భయం కలిగించేలా ఉంది. ఇక ఈ చిత్రానికి విఘ్నేష్ వాసు సినిమాటోగ్రఫీ అందించాడు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద 'కట్టేరి' స్నీక్ పీక్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో పొన్నంబలం - కరుణాకరన్ - రవి మరియా - మైంమ్ గోపి ఇతర పాత్రలు పోషించారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=6NiO5Ov_tZ8&feature=youtu.be
Tags:    

Similar News