తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచిన విషయం తెల్సిందే. కౌశల్ ఆర్మీ కారణంగానే కౌశల్ గెలిచాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్ ఆర్మీ గురించి పలువురు పలు రకాలుగా అంటూ ఉంటున్నారు. ఎన్నో విధాలుగా కౌశల్ ఆర్మీ గురించిన విమర్శలు వచ్చాయి. కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అనేది మొదటి నుండి ప్రముఖంగా వినిపిస్తున్న విమర్శ. ఇప్పటికే కౌశల్ ఆర్మీ మెంబర్స్ ఈ విమర్శపై ఘాటుగానే స్పందించారు. ఇక బాబు గోగినేని ఈ విషయమై ఇంకా కూడా వివాదాన్ని కొనసాగిస్తున్నాడు.
కౌశల్ విజయం పట్ల బాబు గోగినేని స్పందిస్తూ బిగ్ బాస్ ను సైతం విమర్శించాడు. పెయిడ్ ఆర్మీ అని - డబ్బులతో ఓట్లు కొనుగోలు చేశాడు అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ స్పందించాడు. కౌశల్ ఈ విషయమై కాస్త సీరియస్ గానే స్పందిచాడు. తనపై చేస్తున్న ఆరోపనలను నిరూపిస్తే - తాను ఫ్రాడ్ చేసి గెలిచినట్లుగా నిరూపిస్తే తన టైటిల్ ను మరియు ప్రైజ్ మనీని వారికి ఇచ్చేస్తాను అంటూ సవాల్ విసిరాడు.
తన ఆర్మీ గురించి ఎవరైనా విమర్శ చేస్తే ఎంత దూరం వెళ్లేందుకు అయినా తాను సిద్దం అంటూ ప్రకటించాడు. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయినప్పటి నుండి కూడా కౌశల్ ఆర్మీ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. సీజన్ ముగిసే వరకు మొత్తం షోను తమ కంట్రోల్ లోకి తీసుకుని షోను రన్ చేసిన విషయం తెల్సిందే. కౌశల్ ఆర్మీ అనుకున్నట్లుగా షో జరిగిందని సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపిస్తుంది. ఇంత పవర్ ఫుల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అంటూ ఎలా విమర్శలు చేస్తారు అంటూ కౌశల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.