ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటే అయ్యో అనిపిస్తుంది ఎవరికైనా. బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి.. స్వశక్తితో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత సక్సెస్ ను నిలబెట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. చివరికి అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉదయ్ తో అనుబంధం ఉన్నవాళ్లను కదిలిస్తే కన్నీటి పర్యంతం అయిపోతారు. ఉదయ్ ను కొడుకులాగా చూసుకున్న సుధ.. ఆ మధ్య ఎంతటి ఉద్వేగానికి గురయ్యారో తెలిసిందే. ఇప్పుడు ‘బిగ్ బాస్’ రెండో సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్ సైతం ఉదయ్ ను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఉదయ్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అతను చెప్పాడు. తాను ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉండగా.. ఒక రోజు ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడానని.. ఆ ఎపిసోడ్ ప్రసారం చేయలేదని తర్వాత తెలిసిందని చెప్పాడు.
ఉదయ్ కిరణ్ పేరు ప్రస్తావించినపుడల్లా ‘నా ఉదయ్ కిరణ్’ అని కౌశల్ పేర్కొనడం విశేషం. తనకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక ఫ్రెండ్ ఉదయేనని చెప్పాడు. బిగ్ బాస్-2 హోస్ట్ నానిని చూస్తే తనకు ఉదయ్ కిరణే గుర్తుకొచ్చేవాడని అతను చెప్పాడు. నాని కూడా ఉదయ్ లాగే బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సొంత కష్టంతో ఎదిగాడని.. వీళ్లిద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట ప్రాంతం నుంచే వచ్చారని.. ఇద్దరూ చూడ్డానికి కూడా ఒకేలా ఉంటారని.. దీంతో తాను నానికి బాగా కనెక్టయిపోయానని.. ఆయనలో ఉదయ్ ని చూసుకున్నానని చెప్పాడు. కొన్ని సార్లు నాని తనను ఏదైనా అడుగుతుంటే.. విషయం మరిచిపోయి ఉదయ్ ని తలుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేవాడినని చెప్పాడు. ‘బిగ్ బాస్’ నుంచి బయటికి వచ్చాక తాను ఉదయ్ గురించి మాట్లాడిన ఎపిసోడ్ ఉందేమో అని చూశానని.. దాన్ని టెలికాస్ట చేయలేదని తెలిసిందని.. ఇలాగే తాను ముఖ్యమైన విషయాలు చెప్పినప్పటి ఎపిసోడ్లు మిస్సయి ఉంటే.. వాటన్నింటి గురించి అభిమానులతో పంచుకుంటానని కౌశల్ చెప్పాడు.