కౌశల్ ఎంత స్పీడ్ గా క్రేజ్ ను దక్కించుకుని అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతే స్పీడ్ గా విమర్శల పాలయ్యాడు. కౌశల్ ఆర్మీని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గా మార్చి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కౌషల్ ఆర్మీకి చెందిన కొందరు మాజీ సభ్యులు మీడియా ముందుకు వచ్చి కౌశల్ ఫౌండేషన్ డబ్బులను వృదా చేస్తున్నాడు - తానో పెద్ద స్టార్ గా తనకు తాను ఫీల్ అవుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలకు కౌశల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు. తాను కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులను వృదా చేయలేదని - వచ్చిన ప్రతి పైసాకు కూడా లెక్క చూపిస్తానంటూ ప్రకటించాడు. ఎవరైనా నా వద్దకు వచ్చి వారిని ఉన్న అనుమానాలు వ్యక్తం చేస్తే నేను అన్ని విషయాలను వెళ్లడించేందుకు సిద్దంగా ఉన్నాను అన్నాడు. కౌశల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీడియాలో కౌశల్ విషయమై పెద్ద ఎత్తున చర్చ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కౌశల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను చెప్పాలనుకున్నది మీడియా సమావేశంలో చెప్పాను - ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగమని చెప్పాను - అనవసరంగా చర్చ కార్యక్రమాలు పెట్టి నన్ను - నా కుటుంబ సభ్యులను మానసికంగా వేదించకండి అంటూ మీడియా వారికి కౌశల్ రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయం నా పిల్లలపై ప్రభావం చూపుతుంది. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. ఆమెను చూసుకోవడం నా బాధ్యత. దయచేసి ఇకనైనా ఈ విషయాన్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ను రద్దు చేస్తున్నట్లుగా కౌశల్ ప్రకటించిన విషయం తెల్సిందే.