బెంగళూరులో ఒక పార్క్ లో హీరోయిన్ సంయుక్త హెగ్డే స్నేహితులతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సామాజిక కార్యకర్త అయిన కవిత రెడ్డి దాడికి దిగిన విషయం తెల్సిందే. పబ్లిక్ ప్లేస్ ల్లో బ్రాలతో వర్కౌట్స్ ఏంటీ అంటూ కవిత చేసిన హడావుడిని సంయుక్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై దాడికి దిగిందంటూ సంయుక్త నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంయుక్త పోలీస్ స్టేషన్ లో కూడా సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వడం అంతా చూశారు.
రెండు రోజుల తర్వాత తాను చేసిన పనికి కవిత రెడ్డి క్షమాపణలు చెప్పింది. పోలీసులు ఇద్దరిని ప్రశ్నించి చివరకు సంయుక్త హెగ్డే తప్పు లేనట్లుగా నిర్థారించారు. కవిత రెడ్డి ఈ విషయంలో అనవసరంగా న్యూసెన్స్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అందుకే ఆమెతో సంయుక్తకు క్షమాపణ చెప్పించారు. ఇదే సమయంలో సంయుక్త హెగ్డేకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలియజేయడంతో పాటు కవిత రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. ఎవరి డ్రస్ లు ఎలా ఉంటే నీకు ఏంటీ అంటూ కాజల్ కూడా కవిత రెడ్డిని ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే.
Full View