మళ్ళీ ఫైర్ అయిన కీరవాణి బాంబ్

Update: 2017-04-23 12:10 GMT
బాహుబలి విజయం ఇప్పుడు ఆ సినిమాకు పని చేసిన వారి కెరీర్ లో ఒక గొప్ప మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ విజయం వాళ్ళ స్థాయిని మరింత పెంచింది. ఈ సినిమ కు పనిచేసిన నటులు కావచ్చు.. టెక్నీషియన్స్ కావచ్చు.. అందరికీ ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యమైన శాఖ సంగీతం.. ఈ సినిమా కు సంగీతం సమకూర్చింది రాజమౌళి పెద్ద అన్న ఎమ్ ఎమ్ కీరవాణి అని చెప్పనవసరం లేదు.

ఆ మధ్య బాహుబలి 2 ఆడియో రిలీజ్ కు ముందు.. సంచలన వ్యాఖ్యలు ట్వీటేసి.. విమర్శలకు గురయ్యారు ఈ పెద్దాయన. ''చాలా మంది డైరెక్టర్ లకు మైండ్ సరిగా ఉండదు ఎందుకు సంగీతం అడుగుతారో వాళ్ళకే తెలియదు'' అని కీరవాణి ట్వీట్లేయడంతో.. మరి ఒకప్పుడూ ఇతనుకి మైండ్ ఏమైందో అని అతని పనితనం తెలిసిన వారు సోషల్ మీడియా లో గట్టిగానే సమాధానం ఇచ్చారు. అది పక్కన పెడితే ఈ మధ్య ప్రముఖ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గేయ రచయత లుకు అనుకూలంగా మాటలాడుతూ వాళ్ళకి చురకలు అటించాడు.

సరియైన కథ లేకుంటే వేటూరి సిరివెన్నల లాంటి వాళ్ళు డైరెక్టర్ ని తిడతారు కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళు మనం చూడట్లేదు అంటూ కామెంట్ చేశాడు కీరవాణి. ఇంకో ప్రశ్న కి సమాధానం గా ఐటెమ్ సాంగ్స్ ఉండవలిసిందే అని దానిలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పాడు. పెద్దాయనుకు మరి ఇది ఏ లాజిక్ తో కథకు భాగం అనుకుంటున్నారో అర్ధంకావట్లేదు.

అలానే గాయకులు పారితోషకం పై నా వచ్చిన  ధూమరాన్ని పెద్దగా పాటించుకోలేదు. వాళ్ళకి తక్కువ అనిపిస్తే మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు.. అలా వెళుతున్నారు అంటే వాళ్లిక అది ఒకే అనే కదా అంటూ కామెంట్ చేశాడు కీరవాణి. ఈసారి ఈయన పేపర్లో ఫైర్ అవ్వడంతో.. నెటిజన్లు పెద్దగా ఇదంతా పట్టించుకున్నట్లు లేరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News