#RRR గురించి పెద్ద హింట్ ఇచ్చేసిన కీరవాణి!

Update: 2019-01-05 17:20 GMT
రాజమౌళి తాజా చిత్రం #RRR గురించి ప్రేక్షకులకు తెలిసిన అధికారిక సమాచారం చాలా తక్కువ. ఈ సినిమా గురించి పక్కాగా తెలిసిన సమాచారం హీరోలు.. సంగీత దర్శకుడు.. సినిమాటోగ్రాఫర్.. నిర్మాతల పేర్లు మాత్రమే. ఇవి కాకుండా సెట్ల వివరాల లాంటివి అన్నీ అనధికారిక సమాచారమే.  ఇక అన్నిటికంటే పెద్ద స్పెక్యులేషన్ మాత్రం సినిమా జోనర్ గురించే.  ఈ సినిమా పునర్జన్మ కథాంశం తో రెండు కాలాలలో జరుగుతుందని ఒక టైం ఫ్రేమ్ బ్రిటిష్ కాలం (1930) కాగా మరో టైం ఫ్రేమ్ ప్రెజెంట్లో అంటే 2019 లో జరుగుతుందని అంటున్నారు.

ఇది ఎంతవరకూ నిజమనే దానిపై ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. కానీ తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. జక్కన్నగారి అన్నగారు అయిన ఎంఎం కీరవాణి 'ఎన్టీఆర్ కథానాయకుడు' ప్రమోషన్లలో భాగంగా ఈ వార్తను పరోక్షంగా కన్ఫాం చేశారు.  రిపోర్టర్లు #RRR గురించి అదేపనిగా ప్రశ్నిస్తుండడంతో.. "మార్చ్ నుండి #RRR సంగీతం పై పనిచేయాలి.  ఈ సినిమా సంగీతం పీరియడ్ ట్యూన్స్ తో పాటు లేటెస్ట్ ట్రెండీ ట్యూన్స్ కాంబినేషన్ గా ఉంటుంది" అన్నాడు. ఈ లెక్కన బ్రిటిష్ పీరియడ్ ట్యూన్స్ తో పాటుగా ఇప్పటి జనరేషన్ ట్యూన్స్ అని కన్ఫాం చేసినట్టే కదా.
 
అంటే ప్రస్తుతం #RRR కథ గురించి ప్రచారంలో ఉన్న స్పెక్యులేషన్లన్నీ నిజమే అన్నమాట.  రాజమౌళి తో పాటుగా #RRR టీమ్ అంతా సీక్రెట్ గా మెయిన్టైన్ చేస్తున్న దానిని కీరవాణి యధాలాపంగా బైటపెట్టేసినట్టే.  
    

Tags:    

Similar News