లైలా టీజర్‌కు బాలయ్య ఫిదా
డాకు మహరాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న బాలయ్యకు లైలా టీజర్‌ను చూపించారు విశ్వక్ సేన్.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లైలా. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పిక్చర్స్ మరియు ఎస్‌ఎమ్‌టి అర్చన ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కామెడీ డ్రామా, మాస్ మోమెంట్స్ కలగలసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్స్ ఇప్పటికే అంచనాలను రెట్టింపు చేశాయి.
హీరో విశ్వక్ సేన్ ప్రతి సినిమాలో తన పాత్రకు ప్రత్యేకతను తీసుకురావడంలో ముందుంటారు. సరికొత్త కథల్ని ఎంచుకోవడంలో కూడా అతని ఆలోచనా విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఫలక్‌నుమా దాస్ నుంచి మొన్న వచ్చిన మెకానిక్ రాకీ వరకు, ప్రతి చిత్రంలో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లైలాలో కూడా విశ్వక్ మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించబోతున్నారు.
ఈ సినిమాలో అతను అమ్మాయి గెటప్ తో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. విశ్వక్ సేన్, నందమూరి బాలకృష్ణతో స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాకు మహరాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న బాలయ్యకు లైలా టీజర్‌ను చూపించారు విశ్వక్ సేన్. ఈ టీజర్ చూసిన బాలయ్య విశ్వక్ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకించి మాస్ మూమెంట్స్ బాగా ఎలివేట్ అయ్యాయని చెప్పిన బాలయ్య, టీజర్‌ను ఫెంటాస్టిక్ అని అభివర్ణించారు.
విశ్వక్ స్వయంగా తన మొబైల్ లో బాలకృష్ణకు లైలా టీజర్‌ను చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక టీజర్ చూసి ఆయన ఇచ్చిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీజర్‌లో విశ్వక్ మాస్ సీన్స్ బాలయ్యకు కిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకుల మధ్య ఈ సినిమా గొప్పగా నిలుస్తుందని అర్ధమవుతుంది
బాలయ్య వంటి సీనియర్ హీరో నుంచి ఇలాంటి ప్రశంసలు విశ్వక్ సేన్ కెరీర్‌కు మరింత ప్రోత్సాహం అందజేస్తాయి. విశ్వక్ సేన్, బాలయ్య మధ్య ఈ అనుబంధం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం లేకుండా, ప్రతీ అంశాన్ని సమర్థంగా అమలు చేసినట్లు టీజర్‌ను చూసిన తరువాత ఒక నమ్మకం ఏర్పడింది. ఇక టీజర్ ను శుక్రవారం సాయంత్రం 4:05కి విడుదల చేయబోతున్నారు. మరి ఆ టీజర్ ఆడియెన్స్ కు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.