కీరవాణి పాడితే.. రాజమౌళికి కన్నీరే!!

Update: 2017-03-26 17:27 GMT
''అసలు అందరూ 'వై కట్టప్ప కిల్లడ్ బాహబులి' అంటున్నారు. నేను ఈ లైన్ మీద ఒక పాట చేస్తానంటే రాజమౌళి వద్దన్నాడు. ఇక అందరికీ ఈ 'Why' అనే ప్రశ్న ఉంటే.. నా మదిలో మాత్రం చాలా 'How'లు ఉన్నాయి'' అంటూ తన మదిలో ఉన్న 'హౌ' ల గురించి చాలా ఆసక్తికరంగా చెప్పారు మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి. ఆల్రెడీ ఆదివారం సాయంత్రం నుండి నేను సినిమాలు చేస్తానే లేదా అంటూ బీభత్సంగా ట్వీట్లు వేసి రచ్చ చేసిన కీరవాణి.. బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో భలే సందడి చేశారు.

ఇకపోతే ఈయన తన స్పీచ్ ను ప్రారంభించే ముందు.. ఒక పాట పాడారు. ''ఎవ్వడంట ఎవ్వడంట బాహుబలి తీసింది'' అంటూ బాహబలి 1లోని పాటకు తానే ఒక ప్యారడీ కంపోజ్ చేసి.. తన తమ్ముడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ పాట పాడుతూ రాజమౌళిని స్టేజీ మీదకు పిలువగానే.. ఆ పాటలోని లిరిక్స్ కు రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక పాట పూర్తవ్వగానే.. రాజమౌళిని ఇంత సెంటిమెంటల్ చేసినందుకు సారీ అంటూ కీరవాణి చెప్పేయడంతో.. రాజమౌళి ఇంకా ఉద్రేకానికి లోనయ్యాడు. అలాగే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఇక కీరవాణి How విషయానికొస్తే.. ''శోభు పెదాల మీద చిరునవ్వు హౌ? రమ్య కృష్ణ బోలెడు జోకులేస్తూ శివగామి పాత్ర ఎలా చేసింది.. హౌ? దేవసన బయట చిన్నపిల్లలా ఉంటుంది.. ఇక్కడ అద్భుతంగా నటించింది.. హౌ? ప్రభాస్ లో అసలు గర్వం లేదు. హౌ? మా ఆవిడ వల్లి 3 గంటలకు లేచి వంటొండి 5 గంటలకు ఫిలిం సిటీ.. మళ్ళీ 12 గంటలకు ఇంటికి రావడం.. 5 సంవత్సరాల నుండి ఇంతే. హౌ?''  అంటూ ప్రశ్నించారు. మరి సమాధానాలు ఆయనకు ఆల్రెడీ దొరికాయనే అనుకుందాం.
Tags:    

Similar News