కీర్తి సురేష్.. ప్రస్తుత సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమె అడుగుపెట్టిన చోటల్లా హిట్లు పడుతున్నాయి. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుని గాల్లో తేలిపోతోంది కీర్తి. తాజాగా తెలుగులో ‘నేను లోకల్’ లాంటి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. కీర్తి తల్లి మేనక ఒకప్పటి కథానాయిక. ఆమె తండ్రి సురేష్ మలయాళంలో నిర్మాత. ఇంత పేరున్న కుటుంబ నుంచి వచ్చినప్పటికీ లండన్ లో చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డానని అంటోంది కీర్తి. అక్కడ తాను వర్ణ వివక్ష ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించింది.
‘‘డిగ్రీలో కాలేజీ విద్యార్థుల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా స్కాట్లాండ్ లో అయిదు నెలల పాటు చదువుకున్నాను. నేను చదువుకున్న కాలేజీ గ్రామీణ ప్రాంతంలో ఉండేది. ఎంతో ప్రశాంతంగా ఉండేది ఆ వాతావరణం. ఆ తర్వాత లండన్‌లో నెలన్నర ఇంటర్న్‌షిప్ చేశాను. అప్పుడు నేను పనిచేసిన కంపెనీలో వర్ణ వివక్ష ఎదుర్కొన్నాను. కొత్తగా డిజైన్ చేసిన బట్టల్ని పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి నాకిచ్చి వాటిని ఫ్యాక్టరీల్లో వేసి రమ్మనేవారు. నాతో పాటు మనవాళ్లను తక్కువగా చూసేవాళ్లు. స్థానికులకు మాత్రం అలాంటి పనులు చెప్పేవారు కాదు. మమ్మల్ని ఉద్యోగుల్లా కాకుండా పనివాళ్లలా చూసేవారు. ఆ సమయంలో అవన్నీ తట్టుకోవడం చాలా కష్టమైంది. ఇదేం లైఫ్ అనిపించింది. ఇప్పుడు మాత్రం ఆ కష్టాల్ని తలుచుకుంటే అదో గొప్ప అనుభవం అనిపిస్తోంది. యూకేలో ఉన్న ఆ కొద్దిరోజులూ నా జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. అక్కడ మన లాగా ఉరుకుల పరుగుల జీవితం ఉండదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాకే దాని విలువ నాకు అర్థమైంది. కొన్ని ఈ మధ్యనే లండన్ వెళ్లి మళ్లీ ఆ ప్రశాంతమైన వాతావరణంలో గడిపి వచ్చాను’’ అని కీర్తి చెప్పింది.