డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయింది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా ఏ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో విడుదలవుతుందో అని ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం మనకి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్, ఆహా.. ఇలా చాలా ఓటీటీ యాప్స్ సక్సెస్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇంకా ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ ఒకటని చెప్పుకోవచ్చు.
కొత్త కంటెంట్ తో వెబ్ సిరీస్ లను ఒరిజినల్ మూవీలను ఆడియన్స్ కి అందిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా అన్ని సినీ ఇండస్ట్రీలలో క్రేజీ మూవీస్ ని దక్కించుకొని డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రాబోతోందని అఫిసియల్ గా ప్రకటించారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన హిందీ చిత్రం 'గులాబో సితాబో' మరియు విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శకుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ' కూడా ప్రైమ్ లో రిలీజ్ అవబోతున్నాయి. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో జూన్ 19న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఇలా ఐదు సినిమాలను లైన్లో పెట్టి ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తోంది అమెజాన్.
అయితే అమెజాన్ ప్రైమ్ పై కొంతమంది సబ్స్క్రైబర్స్ అసహనంతో ఉన్నారట. దానికి కారణం వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒరిజినల్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లను రిలీజ్ చేయకుండా ఇలా సినిమాలను లైన్లో పెట్టడమే. వాస్తవానికి ప్రైమ్ కి సబ్స్క్రైబర్స్ పెరగడానికి కారణం అందులో వచ్చిన వెబ్ సిరీసెస్. ముఖ్యంగా 'మీర్జాపూర్' మరియు 'బ్రీత్' వెబ్ సిరీస్ ల వలన భారీగా సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు. హీరో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బ్రీత్'.. పంకజ్ త్రిపాఠి శ్వేతా త్రిపాఠి అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మీర్జాపూర్' ప్రైమ్ కి భారీ క్రేజ్ ని తీసుకొచ్చాయి. అప్పటి నుండి వీటి సెకండ్ సీజన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సిరీస్ లను ఎందుకు రిలీజ్ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రైమ్ వారు మాత్రం సబ్స్క్రైబర్స్ అభ్యర్థనను పట్టించుకోకుండా.. వాటి విడుదల తేదీలను ప్రకటించకుండా.. కొత్త మూవీస్ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం అందరూ వేరే ఓటీటీల వైపు చూసే అవకాశం ఉందని.. దీంతో ప్రైమ్ భారీగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.